కొడాలి నానిని బర్తరఫ్ చేయాల్సిందే.. లేకపోతే జగన్ చీటీ చిరగడం ఖాయం : అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నానిల దౌర్జన్యాలు, అరాచకాలు, పాపాలను ప్రజలు భరించే రోజులు పోయాయన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. గుడివాడలో క్యాసినో నిర్వహణ గుట్టు రట్టు చేసేందుకు వ‌చ్చిన‌ టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులపై వైసీపీ గుట్కా బ్యాచ్ దాడి చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ అస‌లు తప్పే జరగకపోతే తమ పార్టీ నేతలను అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటని ప్ర‌శ్నించారు. మంత్రి కొడాలి నాని కోడె తాచులా స్థానిక యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.

 గుడివాడ‌లో గుట్కా బ్యాచ్..

గుడివాడ‌లో గుట్కా బ్యాచ్..

గుడివాడలో గంజాయి బ్యాచ్‌ను అడ్డుపెట్టుకోని టీడీపీ నేత‌ల‌పై దాడులకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నాని క్యాసినో గుట్టు రట్టవుతుందన్న భయంతోనే గడివాడ గుట్కా రౌడీ బ్యాచ్ నానా వీరంగం సృష్టించారు. అక్రమ సంపాదన కోసం గుట్కా బ్యాచ్ గుడివాడను మట్కాకు , జూదాలకు , వ్యవసనాలకు కేంద్రంగా మార్చారని ఆరోపించారు. క్యాసినో , జూదం, క్యాబరే డ్యాన్స్‌లు ఏర్పాటు చేసి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆసాంఘిక కార్యకలాపాలు

ఆసాంఘిక కార్యకలాపాలు

పోలీసుల్ని అడ్డుపెట్టుకుని మంత్రి కొడాలి నాని స్థానిక యువత జీవితాలను నాశనం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పనికిమాలిన‌ పనులు చేస్తూ మహానుబావుడి పరువు తీస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో కొడాలి నాని పంక్షన్ హాల్లో జరిగిన ఆసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు, సాక్షాలతో సహా బయటపెట్టి ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు..

Recommended Video

    కొడాలి నాని పై నందమూరి ఫాన్స్ ఫైర్ || Ap Minister Made Sensational Comments On NTR Film Journey
    సీఎం జగన్ చీటి చిరగడం ఖాయం

    సీఎం జగన్ చీటి చిరగడం ఖాయం

    పబ్లిక్‌గా గుడివాడలో క్యాసినో, క్యాబరే, జూదం నడిపిస్తుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇవేమి కన్పించడంలేదా ? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. లేదా, వచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి నటిస్తున్నారా ? అని నీలదీశారు. టీడీపీ నాయకులపై దాడుల ఘటనలో మంత్రి కొడాలి నాని, వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించాలన్నారు. క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని లేకపోతే సీఎం జగన్ చీటి చిరగడం ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+