Rainfall Alert: 2 రోజులు ఏపీలో వర్షాలు.. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ
నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అనేక చోట్ల వర్షాలు కురిసాయి. ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులు వర్ష బీభత్సం ఉంటుందని అధికారులు వివరించారు. ఈ యేటా వర్షాలు ఆశించిన స్థాయిలో కురిశాయి.

నైరుతి నిష్ర్కమణ
ఈ నెల 26న నైరుతి నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో అనేక చోట్ల శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇక ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుండడంతో అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇక్కడ వర్షాలు
ఈశాన్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతం మొత్తం, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కర్ణాటక మధ్య అరేబియా సముద్రం ఏరియాలో మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించాయి. అక్టోబర్ 26, 2021న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందు వల్ల నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమిస్తాయి.

దైవభూమిలో..
ఇటు కేరళలో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో.. వారి బాధ వర్ణణాతీతంగా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగింది. ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంది. ఆయకట్టు కింది ప్రాంతాలు.. ఇతర చోట్ల పంటలకు ఢోకా లేకుండా పోయింది. ప్రాజెక్టు నీరు రానీ చోట.. బావులపై ఆధారపడిన వారు మాత్రమే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications