AP Weather: ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అది ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండటం వలన అల్పపీడనము ఏర్పడటం ఆలస్యం అవుతోంది.

తాజా అంచనాల ప్రకారం.. ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం చుట్టూ అక్టోబర్ 13 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులి దక్షిణ ఒడిషా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు అక్టోబర్ 15 నాటికి చేరి బలపడి అల్పపీడనంగా మారుతుందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

 AP Weather update: Three more days narmol to heavy rains in Andhra Pradesh state.

ఒక తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి ఉత్తరఅండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రల మీదుగా తూర్పుమధ్య అరేబియా సముద్రప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కొనసాగనున్నాయి.

సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది నేటి నుంచి మరో మూడు రోజులపాటు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. సోమ, మంగళ, బుధవారాల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.

కాగా, గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలోనైతే భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు, ప్రజల బాధల వర్ణనాతీతంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+