ఏపీఈఏపీసెట్ సహా సెట్ పరీక్షల రీషెడ్యూల్: కొత్త తేదీలివే
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2024) పరీక్ష షెడ్యూల్‌లో మార్పు చేశారు. మొదట నిర్ణయించిన ప్రకారం మే 13 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష మే 16, 17 తేదీల్లో; ఇంజినీరింగ్ పరీక్ష మే 18 (సెషన్-1) , 19న (సెషన్-2), 20, 21, 22 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అలాగే, ఏపీ పీజీసెట్ పరీక్ష జూన్ 3 నుంచి 7 వరకు జరగాల్సి ఉండగా.. వాటిని జూన్ 10, 11, 12, 13, 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్ సెట్‌కు షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ పరీక్షలను మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ పాలిసెట్ వాయిదా: కొత్త తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(Polycet 2024) వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. మే 17న పాలిసెట్ జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ విడులైన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్) సీట్లను పాలిసెట్ లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. రూ. 100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు, రూ. 300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications