ఉద్యోగాల జాతర - ఏపీపీఎస్సీ 20 నోటిఫికేషన్లు..!!

ఏపీలో ఉద్యోగాల భర్తీ దిశగా కసరత్తు జరుగుతోంది. నోటిఫికేషన్ల జారీ దిశగా ఏపీపీఎస్సీ అడుగులు వేస్తోంది. త్వరలో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా వీటిని విడుదల చేస్తామని స్పష్టం చేసారు. వీటి ద్వారా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ దిశగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అటవీ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల స్క్రీనింగ్ పరీక్షలపైనా స్పష్టత ఇచ్చారు.

వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి త్వరలో 20 నోఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ప్రకటించారు. వీటి ద్వారా దాదాపు 80 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ నెలాఖరుకే ఈ నోటిఫికేషన్లు జారీ అవుతాయని తెలిపారు. అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 691, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 100 భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేశామని వివరించారు.

APPSC begin exercise to release 20 job notifications soon details here

ఈ నెల 7న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో స్ర్కీనింగ్‌ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్లపై వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ఒకసారి సమాధానం రాసి, దాన్ని వైట్‌నర్‌ లేదా ఇతర మార్గాల్లో చెరిపివేస్తే, ఆ పేపర్లను ఇన్‌ వాలిడ్‌గా పరిగణిస్తారని వెల్లడించారు.

అదే విధంగా ప్రతి మూడు తప్పులకు ఒక మైనస్‌ మార్కు ఉంటుందన్నారు. కాగా, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల జాబితాలు శాప్‌ నుంచి రానందున గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల ఫలితాలు నిలిచిపోయాయని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటా మినహా మిగిలిన పరీక్షల ఫలితాల ప్రక్రియ మొత్తం పూర్తయిందని రాజాబాబు చెప్పుకొచ్చారు.

గ్రూప్‌-2లో 1634 మంది అభ్యర్థుల కంటిచూపు, 24 మంది అభ్యర్థుల వినికిడి రిపోర్టులు అందాల్సి ఉందన్నారు. గ్రూప్‌-1, 2 ఫలితాలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మ వద్దని సూచించారు. కాగా, త్వరలో విడుదల చేసే నోటిఫికేషన్లలో తక్కువ పోస్టులు ఉండటంతో అన్నింటికీ కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహించేలా ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అటు ఈ వారంలోనే డీఎస్సీ పోస్టుల భర్తీ దిశగా కసరత్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+