నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు - పోస్టులు ఇలా..!!
ఉద్యోగాల భర్తీ కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా 1,603 పోస్టులకు సంబంధించిన 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 900 వరకు గ్రూప్-2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్-1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తాజాగా చేసిన కొన్ని మార్పులకు సంబందించి కమిషన్ స్పష్టత ఇచ్చింది.
ఈ నెలలోనే నోటిఫికేషన్లు: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్-2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్-1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు.
ఖాళీల వివరాలు: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు -267, పాలిటెక్కిక్ అధ్యాపకులు - 99, టటీడీ డీఎల్, జేఎల్ -78, జూనియర్ కళాశాలల అధ్యాపకులు -47, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ -38, ఇంగ్లీస్ రిపోర్టర్స్ (ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)-10, గ్రంధపాలకులు (కళాశాల విద్య) -23, ఏపీఈఆర్ఐ సొసైటీ కింద 10 జేఎల్, 05 డీఎల్ పోస్టులు, పిషరీస్ డిపార్టుమెంట్ లో 4 డెవలప్ మెంట్ ఆఫీసర్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ లో 4 గ్రంధ పాలకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
పారదర్శకంగా నియామకం: వీటితో పాటుగా భూగర్భ నీటిపారుదల శాఖ, జిల్లా సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టరేట్ సర్వీస్, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఏపీ మున్సిపల్ ఎకౌంట్స్ సబ్ సర్వీసెస్ లో జూనియర్ ఎకౌంట్ ఆఫీసర్ కేటగిరీ -2, సీనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ -3, జూనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ -4 కింద మరికొన్ని పోస్టుల భర్తీకి ఈ నెలలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications