ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
APPSC: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ ఇచ్చింది. త్వరలో జరగబోయే గ్రూప్ 1 పరీక్షల హాల్ టికెట్ల విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఓ ప్రకటనను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్షల హాల్ టికెట్ల విడుదల తేదీని వెల్లడించింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు రాయడానికి అవసరమైన హాల్ టికెట్లను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలియజేసింది. 10వ తేదీన కమిషన్ అధికారిక వెబ్ సైట్.. https://psc.ap.gov.in లో ఈ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులందరూ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

గ్రూప్ 1 సర్వీస్ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీని కూడా ఈ ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేసింది. పరీక్షల తేదీలో ఎలాంటి మార్పూ ఉండబోదంటూ గతంలోనే ఏపీపీఎస్సీ అధికారికంగా వివరించిన విషయం తెలిసిందే. ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలను ఏపీపీఎస్సీ షెడ్యూల్ చేసింది. మొత్తం 18 జిల్లాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల వివరాలను హాల్ టికెట్‌లో పొందుపరుస్తారు.
అభ్యర్థులు.. నిర్దేశిత గడువు కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాయడానికి ఒక రోజు ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించడం వల్ల ప్రయాణ సమయంలో ఎలాంటి గందరగోళానికి అవకాశం ఉండబోదని ఏపీపీఎస్సీ అధికారులు సూచిస్తోన్నారు.
వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల్లో 81 గ్రూప్ 1 సర్వీసు పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో డిప్యూటీ కలెక్టర్-9, టాక్స్ అసిస్టెంట్ కమిషనర్-18, డీఎస్పీ (సివిల్)-26, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్-6, కోఆపరేటివ్ సర్వీస్ డిప్యూటీ రిజిస్ట్రార్5-5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్-4 పోస్టులు ఉన్నాయి.
అలాగే- జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి-3, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి-3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాళీలు ఒకొక్కటి చొప్పున భర్తీ కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications