ఏపీకి వర్షసూచన- ఈ జిల్లాల్లో ఓ మోస్తరుగా..

AP Rains: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా అక్కడకక్కడ ఫర్వాలేదనిపించేలా వర్షపాతం నమోదైంది.

ఇదే పరిస్థితి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది.

APSDMA has predicts moderate rains in several districts in the state for today

ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, ఉత్తర- మధ్య కోస్తా, దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, ఏజెన్సీ ఏరియా, రాయలసీమ జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అక్కడక్కడ పిడులుగు పడే అవకాశం ఉందని పేర్కొంది.

కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వీటితో పాటు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.

వర్షాలు కురుస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడుతున్న సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద తలదాచుకోకూడదని విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+