తిరుమల కొండకు ఉచిత ప్రయాణం, పరిమితం - ఇక ఫ్రీ బస్సులో ఇవి తప్పనిసరి..!!

ఏపీలో మహిళల ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, అయిదు కేటగిరీల బస్సు ల్లోనే ఈ పథకం అమలు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఘాట్ రోడ్లలో ఈ పథకం అమలు పైన తొలుత ఆమోదం లభించంలేదు. అయితే, తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ తిరుమల కొండకూ ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది . ఇదే సమయంలో ఈ పథకం వినియోగం కోసం మహిళలకు ప్రత్యేకంగా కార్డులు ఇవ్వనుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఈ పథకం అమలు పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్ రోడ్లలోనూ అమలు దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో, తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఘాట్‌రోడ్డు అయినందున ఆ బస్సుల్లో సీటింగ్‌ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని కొనకళ్ల స్పష్టం చేసారు. అదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్మార్ట్‌ కార్డులను అందజేస్తామని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

APSRTC decided to implement Free bus for women Scheme for Tirumala route

ఉచిత ప్రయాణం వినియోగించుకునే మహిళలు గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. కాగా, ప్రయాణానికి ఆధార్‌ జిరాక్స్‌ కాపీలను కూడా అనుమతించాలని ఆదేశించామని ఎండీ వెల్లడించారు. ఈ పథకం ద్వారా రోజుకు 25నుంచి 26లక్షల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేశామని, అయితే, పథకం ప్రారంభమయ్యాక తొలి ఐదు రోజుల్లో రోజుకు సగటున 18 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు.

విద్యార్థుల బస్సుల్లో స్త్రీ శక్తి వర్తించదన్నారు. ఈ పథకం కొన్ని డిపోల్లో 100 శాతం, తుని డిపోలో 106 శాతం నమోదైందని తెలిపారు. ఈ పథకం అమలు తీరుపై మహిళలు సంతృప్తిగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్టీసీకి 1,150 కొత్త బస్సులు రాబోతున్నాయని, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+