APSRTC.. స్టార్ లైనర్ ప్యాకేజీ: తమిళనాడు, కేరళల్లో ఇవి చూసి రావొచ్చు
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు.
ఏసీ వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. సీటింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతోన్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్యాకేజీ టూర్లు, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు ప్రత్యే బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా అరు ణాచలం, రామేశ్వరం యాత్ర' పేరిట మరో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక యాత్ర బస్సు ఈ నెల 18న సాయంత్రం 4 గంట లకు బయలుదేరి వెళ్లనుంది.
- మొత్తం తొమ్మిది రోజులపాటు సాగే యాత్ర ఇది. 14 క్షేత్రాలు దర్శించుకోవచ్చు. దీని టికెట్ ధర 14,000 రూపాయలు.
- కాణిపాకం మహాగణపతి ఆలయం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, అరుణాచలం అరుణాచలేశ్వరస్వామి ఆలయం, పళని సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు.
- కోయంబత్తూర్ లో ఆదియోగి, కుంభకోణంలో ప్రఖ్యాత శివ కేశవుల ఆలయం, చిదంబరంలో నటరాజ స్వామిని దర్శించుకునే అవకాశం ఉందీ ప్యాకేజీ ద్వారా.
- కేరళలోని గురువాయూర్ లో వెలిసిన శ్రీకృష్ణుడి దేవస్థానం కూడా ఈ ప్యాకేజీలో ఉంది.
- తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని చేర్చారు.
- కన్యకుమారిలో కన్యాకాపరమేశ్వరి ఆలయం, మధురై మధుర మీనాక్షి ఆలయం
- రామేశ్వరంలో రామేశ్వర జ్యోతి లింగం, శ్రీరంగంలో శ్రీరంగనాథ ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయాలను ఈ ప్యాకేజీ ద్వారా దర్శించుకోవచ్చు.
- ఈ యాత్ర కోసం విలాసవంతమైన స్టార్ లైనర్ స్లీపర్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ వినియోగించనుంది.
టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారాన్ని అందిస్తారు. విశ్రాంతి తీసుకోదలచుకుంటే దానికి అవసరమైన ఖర్చును యాత్రికులే భరించాల్సి ఉంటుంది. ఒకే ప్రాంతం నుంచి నలుగురి కంటే ఎక్కువ మంది ఉంటే ఆర్టీసీ సిబ్బంది వారి ఇంటి వద్దకే బస్సు టికెట్లను అందిస్తారు.












Click it and Unblock the Notifications