Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, కారవాన్ టూరిజం - రూట్లు.. ప్యాకేజీలు..!!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సెలవులు ఖరారు కావటంతో.. సొంత ఊర్లకు వెళ్లేందుకు తెలుగు ప్రజలు సిద్దం అవుతున్నారు. సంక్రాంతి వేళ ఈ సారి కొత్త అనుభూతి అందించేందుకు కారవాన్ టూరిజం అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేక వసతులు.. సరికొత్త అనుభూతులు పంచేందుకు సిద్ధమయ్యాయి. సంక్రాంతి వేళ నాలుగు ఎంపిక చేసిన మార్గాల్లో ఈ టూరిజం ప్యాకేజీలను ఏపీటీడీసీ ప్రకటించింది.

ఏపీలో కారవాన్ టూరిజం అందుబాటులోకి వచ్చింది. నాలుగు మార్గాల్లో వీటిని నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) పోర్టల్‌ ద్వారా సులభంగా వాహనాలు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రభుత్వం రెండు సంస్థలు ఎంప్యానల్ చేయగా..నాలుగు కారవాన్​లు తిరగనున్నాయి. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో పర్యాటకుల కోసం పెద్దఎత్తున కారవాన్​లను నడుపుతున్నారు. కొత్తగా ఏపీలోనూ ఈ తరహా టూరిజం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వాహనాల్లో 10 నుంచి 12 సీట్లు ఏర్పాటు చేశారు.

aptdc-announces-caravan-tourism-special-packages-for-sankranti-in-four-routes

అదే విధంగా మరో రెండు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తారు. సంక్రాంతి వేళహైదరాబాద్‌ నుంచి భీమవరం, దిండి వరకు ప్రత్యేకంగా 6 రోజుల ప్యాకేజీతో కారవాన్‌ నడవనుంది. ఈ మార్గంలో ప్యాకేజీ రూ.3.50 లక్షలు. ఈనెల 10, 11, 12 తేదీలకు బుక్‌ చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి 6 రోజుల పాటు ప్యాకేజీ అమలులో ఉంటుంది.

ఈ మూడు తేదీల్లో హైదరాబాద్‌ నుంచి 4 కారవాన్‌లు నడపనున్నారు. సందర్శించాక పర్యాటకులు రాత్రుల్లో కార వాన్‌లోనే నిద్రపోయేలా వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. కూర్చొనే సీట్లనే మీరు నిద్రపోయే విధంగా మార్చుకోవచ్చు. వాహనంలో టీవీ, ఫ్రిజ్, వాష్‌రూం సదుపాయా లు ఉన్నాయి. కాగా.. ప్రకటించిన నాలుగు మార్గాల్లో విశాఖపట్నం-అరకు, లంబసింగి కారవాన్​లో (ఒకటిన్నర రోజు) ధర: రూ.42,500 (10-12 సీట్ల కారవాన్‌), రూ.31,500 (5-6 సీట్లు), రెండో మార్గంగా విశాఖ పట్నం నుంచి సింహాచలం, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్ షారామం మీదుగా వాడపల్లి (ఒకటిన్నర రోజు) ధర: రూ.42,500 (10-12 సీట్లు), రూ.31,500 (5-6 సీట్లు). మూడో మార్గంగాహైదరాబాద్‌-గండికోట (రెండు రోజులు) ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు). ఇక నాలుగో మార్గంలో హైదరాబాద్‌-సూర్యలంక (రెండు రోజులు) ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు) గా ఖరారు చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+