బోటు ప్రమాదం: డ్రైవర్ గేదేల శ్రీనుపై వేటు, నిర్లక్ష్యమే కారణం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కృష్ణా నదిలో పడవ ప్రమాదానికి కారణమైన ఏపీడీటీసీ డ్రైవర్ గేదేల శ్రీనుపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.శ్రీనును ఉద్యోగం నుండి తొలగించింది. అంతేకాదు ఈ ఘటనకు బాధ్యులైనవారిని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  Boat Mishaps in AP : Many doubts raising

  బోటు ప్రమాదం: 17 మందిది ఒంగోలు, ఆ 4 కుటుంబాల్లో విషాదం

  lకృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడిన ఘటనలో 22 మంంది చనిపోయారు. చనిపోయిన వారిలో 17 మంది ఒంగోలు పట్టణానికి చెందినవారు.కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రతి ఏటా విహరయాత్రకు వెళ్తుంటారు.

  అయితే పడవ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఇందులో భాగంగానే చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం.

  బోటు డ్రైవర్ గేదేల శ్రీనును ఉద్యోగం నుండి తొలగింపు

  బోటు డ్రైవర్ గేదేల శ్రీనును ఉద్యోగం నుండి తొలగింపు

  కృష్ణానదిలో పడవ ప్రమాదానికి కారణమైన గేదెల శ్రీనుపై ప్రభుత్వం తీవ్రచర్యలు తీసుకుంది. పర్యాటకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గేదెల శ్రీను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధ్యులైన ఇతరులను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పడవ ప్రమాదంపై పర్యాటకశాఖ విచారణ చేపట్టారు. పర్యాటకశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి గేదెల శ్రీను ప్రమేయం ఉన్నట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ కారణంగా గేదేల శ్రీనును ఉద్యోగం నుండి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

  బోట్ ఆపరేటర్లతో సమావేశం

  బోట్ ఆపరేటర్లతో సమావేశం


  ఏపీ రాష్ట్రంలోని బోట్ ఆపరేటర్లతో మంగళవారం నాడు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బోట్ల నిర్వహణ తీరు తెన్నులపై చర్చించనున్నారు. అంతేకాదు పర్యాటకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకొనే విషయమై ప్రభుత్వం పలు సూచనలను చేయనుంది. ఫెర్రీ తరహ ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోనుంది.

   అధికారుల వైఫల్యంపై ఆరా

  అధికారుల వైఫల్యంపై ఆరా


  కృష్ణా నదిలో పడవ ప్రమాదంపై అధికారుల నిర్లక్ష్యంపై కూడ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరగడానికి ముందు కొంతమంది పర్యాటకులతో ఓ అధికారి బోటులో ఎక్కకూడదని వాదిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ప్రైవేట్ బోటు ఎవరి ప్రమేయం వల్ల నదిలోకి వెళ్ళిందనే విషయమై తేలాల్సి ఉంది. ఈ విషయమై అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

  డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

  డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం


  ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు బోట్లను నడిపరు. అంతేకాదు పరిమితికి మించి బోటులో పర్యాటకులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరగడానికి ముందుగా మూడు సార్లు బోటు కుదుపుకు గురైందని బాధితులు చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A driver of Andhra Pradesh (AP) Tourism Department Corporation (APTDC), Gedala Sreenu, was dismissed from service, as he had colluded with private companies in operating boats without permission. However, more stringent action, like registering of criminal cases against him, are being contemplated.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి