వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కెసిఆర్ దీపం.. రసమయి శాపం’: చిందేసిన కళాకారులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై రాష్ట్రంలోని పలువురు కళాకారులు దుమ్మెత్తిపోశారు. ఉద్యోగాల కోసం రసమయి ఎంపిక చేసిన 550 మంది కళాకారుల్లో 200 మంది నకిలీ కళాకారులు ఉన్నారని, ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని సవాల్‌ చేశారు.

సారథి పదవి నుంచి రసమయిని తొలగించాలని లేదా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘కళాకారుల దీపం కేసీఆర్‌.. సాంస్కృతిక సారథికి శాపం రసమయి బాలకిషన్‌' పేరిట ఉద్యోగాల భర్తీలో నిజమైన కళాకారులకు అన్యాయం జరిగినందుకు నిరసనగా కళాకారులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ‘నిరసన ధూం ధాం'ను నిర్వహించారు.

తెలంగాణ సాంస్కృతిక విభాగం మాజీ అధ్యక్షుడు నేర్నాల కిషోర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పది జిల్లాల నుంచీ పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ ధూం ధాంలో తెలంగాణ పాటలు ఆడి పాడి తమ నిరసన తెలిపారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై రాష్ట్రంలోని పలువురు కళాకారులు దుమ్మెత్తిపోశారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

ఉద్యోగాల కోసం రసమయి ఎంపిక చేసిన 550 మంది కళాకారుల్లో 200 మంది నకిలీ కళాకారులు ఉన్నారని, ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని సవాల్‌ చేశారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

సారథి పదవి నుంచి రసమయిని తొలగించాలని లేదా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

‘కళాకారుల దీపం కేసీఆర్‌.. సాంస్కృతిక సారథికి శాపం రసమయి బాలకిషన్‌' పేరిట ఉద్యోగాల భర్తీలో నిజమైన కళాకారులకు అన్యాయం జరిగినందుకు నిరసనగా కళాకారులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ‘నిరసన ధూం ధాం'ను నిర్వహించారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

తెలంగాణ సాంస్కృతిక విభాగం మాజీ అధ్యక్షుడు నేర్నాల కిషోర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పది జిల్లాల నుంచీ పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ ధూం ధాంలో తెలంగాణ పాటలు ఆడి పాడి తమ నిరసన తెలిపారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

తెలంగాణ సాంస్కృతిక సారథిలో నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం దారుణమని జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ వేదికపైనే కంటతడి పెట్టారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

కాగా, ఉద్యోగాల భర్తీ అధికారాన్ని సాంస్కృతిక సారథి చైర్మన్‌కు ఇచ్చి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు చేశారని దరువు అంజన్న అన్నారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

రసమయి బాలకిషన్‌ను పదవి నుంచి తొలగించాలని విష్ణుకిశోర్‌ డిమాండ్‌ చేశారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

‘రసమయీ.. కేవీపీ నుంచి ఆరు కోట్లు తెచ్చుకున్నావు. నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేశావో జవాబు చెప్పాల్సి వస్తుంది' అని జంగ్‌ ప్రహ్లాద్‌ నిలదీశారు.

కళాకారుల నిరసన

కళాకారుల నిరసన

అసలైన కళాకారులకు ఉద్యోగాలివ్వకుండా అన్యాయం చేయడం సరికాదని ఆయన అన్నారు.

English summary
Some Artists on Tuesday fired at Telangana Samskruthika Sarathi chairman Rasamayi balakishan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X