సాయం చేయబోయి దొరికిపోయిన ఆర్మీ ఉద్యోగి
శ్రీకాకుళం: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఎంపికల్లో ఒక ఉద్యోగి తన బంధువుకు సాయం చేయబోయి దొరికిపోయాడు. శుక్రవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తుండగా సెలవుపై వచ్చిన ఓ ఆర్మీ ఉద్యోగి తన బంధువుకు ఎలాగైనా ఉద్యోగం ఇప్పించాలనే ప్రయత్నంలో అక్రమ మార్గం ద్వారా లోపలికి పంపించే ప్రయత్నం చేశాడు.
దీంతో అక్కడ ఉన్న ఆర్మీ ఎంపిక అధికారులు అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. చేసేది లేక ఆ జవాను తన వివరాలన్నీ అధికారులకు చెప్పుకోవలసి వచ్చింది. పట్టుబడ్డ ఆర్మీ ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నాడు.. బ్యాచ్ నెంబర్.. ఆర్మీ ఉన్నతాధికారి ఎవరు అన్న విషయాలను తెలుసుకున్న స్థానిక ఎంపిక కమిటీ అధికారి ఎకె సింగ్ సంబంధిత అధికారికి ఈ ఉద్యోగి నిర్వాకాన్ని ఫోన్‌లో తెలియజేశారు.

అంతేకాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఎంపికలు పారదర్శకంగా నిర్వహిస్తున్నారనడానికి ఇది ఉదాహరణ. ప్రతిభ ఉన్న అభ్యర్థులకుమరింత స్పూర్తిని కలిగించిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా శ్రీకాకుళంతోపాటు వివిధ జిల్లాల నుంచి శిక్షణా కేంద్రాల నిర్వాహకులు పట్టణంలో మకాం వేసి ఆర్మీ ఎంపికల కోసం లాబీయింగ్ నెరుపుతున్నారన్న పుకార్లకు ఈ సంఘటన చెక్‌పెట్టినట్లయింది. బంధువుకోసం పైరవీలు నెరిపి పట్టుబడ్డ ఆర్మీ ఉద్యోగి వివరాలు చెప్పేందుకు ఇక్కడ అధికారులు నిరాకరించారు.












Click it and Unblock the Notifications