చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారు: ఏర్పాట్లు షురూ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. రాజధాని గ్రామాలు, ఎయిమ్స్‌ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలను కూడా సందర్శించారు.

జూన్ 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీఏ ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున.. ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు.

arrangements for chandrababu swearing ceremony venue confirmed

చివరకు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభా వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినా.. అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండటం.. ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

ఇక, జూన్ 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+