విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో యువ‌తిపై లైంగిక‌దాడికి య‌త్నం..పెనుగులాట‌లో కిందపడిన ఇద్ద‌రు..

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఓ యువ‌తిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన పెనుగులాట‌లో వారిద్ద‌రూ ట్రైన్ నుంచి కింద‌ప‌డ్డారు. దీంతో ఆ యువ‌తికి తీవ్ర గాయ‌ల‌యిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ యువ‌తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు స‌మాచారం.

రైల్వే పోలీసులు ఇచ్చిన పూర్తి సమాచారం ప్ర‌కారం.. నిన్న (మంగళవారం) రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకునే క్ర‌మంలో ట్రైన్ స్పీడ్ కాస్త త‌గ్గింది. దాంతో అదే స‌మ‌యంలో ఆ ట్రైన్ లోని ఎస్-2 బోగీలో ప్ర‌యాణిస్తోన్న ఓ యువ‌తి బాత్‌రూమ్ నుంచి బ‌య‌టికి వ‌స్తోంది. అయితే, అక్క‌డే డోర్ వ‌ద్ద ఉన్న ఓ యువ‌కుడు ఆ యువ‌తిపై లైంగిక దాడికి య‌త్నించాడు. అత‌డు మ‌ద్యం తాగి ఉన్నాడు. ఆ మ‌త్తులో ఆ యువ‌తిపై చేయి వేసి అస‌భ్య‌క‌రంగా తాకాడు. దీంతో ఆ యువ‌తి త‌ప్పించుకునే క్ర‌మంలో రైలు నుంచి కింద‌ప‌డిపోయింది. ట్రైన్ కొద్ది దూరం వెళ్లాక ఆ యువ‌కుడు కూడా రైలు నుంచి కింద పడిపోయాడు.

Attempt to sexually assault a young woman in Visakha Express Two fell in a struggle

శ్రీకాకుళం జిల్లా వాసి..

ట్రైన్‌లోంచి కింద‌ప‌డ్డ ఆ యువ‌తి లేచి సమీపంలోని తండాకు చేరుకుంది. అక్క‌డి వారికి జ‌రిగినదంతా చెప్పింది. వారు పోలీసుల‌కు స‌మాచారాన్ని చేర‌వేసారు. వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని ఆ యువ‌తిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. రైల్వే పట్టాలపై పడి ఉన్న ఆ యువ‌కుడిని పోలీసులు గుర్తించి స‌మీప ఆసుపత్రికి తరలించారు. అయితే, పోలీసుల విచార‌ణ‌లో ఆ యువ‌కుడు ఒడిశాకు చెందిన బిశ్వాస్‌గా గుర్తించారు. ఆ యువ‌తి శ్రీకాకుళం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్ర‌క్రియ చేప‌ట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+