కిడ్నాప్ యత్నం: ఆటోలో నుండి దూకిన డిగ్రీ అమ్మాయి

చిలుకలూరిపేటలోని కళాశాల సమీపానికి చేరుకోగానే ఆటోను ఆపాల్సిందిగా అమ్మాయి డ్రైవర్‌కు సూచించింది. అయితే డ్రైవర్ ఆటో ఆపకుండా వెళ్లాడు. దీంతో ఆమె ఆటోలో నుండి కిందకు దూకింది. ఆటో డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన విద్యార్థినిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీరామవరంలో అమ్మాయిలను అపహరించే ముఠాను గ్రామస్తులు పట్టుకొని చితకబాదిన విషయం తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి నలుగురు యువకులు బైకుల పైన గ్రామానికి వచ్చారు. ఓ యువతిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు.












Click it and Unblock the Notifications