వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాహుబలి...ఈ బ్రాయిలర్ కోడి!...బరువులో రికార్డు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ఎక్కడైనా బ్రాయిలర్ కోడి మూడు, నాలుగు కిలోల బరువుండడం సహజం. మన దగ్గర అంతకుమించి ఎక్కువ తూగిన దాఖలాలు లేవు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఒక బ్రాయిలర్ కోడి ఏకంగా పది కిలోలు తూగి 'ఔరా' అనిపిస్తోంది. అందుకే బాహుబలి బ్రాయిలర్ అని పిలిపించుకుంటోంది.

సాధారణంగా బ్రాయిలర్‌ కోడి మూడు, నాలుగు కిలోల బరువు తూగుతుంది...ఇక మన దేశంలో ఇప్పటివరకు బ్రాయిలర్ కోడి అత్యధికంగా 8 కిలోలు తూగడమే రికార్డుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడా రికార్డును తిరగరాస్తోంది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్రాయిలర్ కోడి. పెద్దాపురం మండలంలోని గోరింటలో ముమ్మిడి గంగాధర్‌కు చెందిన కోళ్లఫారంలో ఈ బ్రాయిలర్ కోడిని మనం చూడొచ్చు. ఇది ఏకంగా పది కిలోలు బరువు తూగి అమ్మో అనిపిస్తోంది. అందుకే స్థానికులు దీన్ని ముద్దుగా బాహుబలి బ్రాయిలర్ అని పిలుచుకుంటున్నారు.

'Baahubali' chicken...is so gigantic

ఈ బాహుబలి బ్రాయిలర్ గురించి దాని యజమాని ముమ్మిడి గంగాధర్ మాట్లాడుతూ బ్రాయిలర్‌ కోడి ఇంతబరువు తూగడం చాలా అరుదని, బొంత కోడి అయితేనే పదికిలోల వరకు ఎదుగుతుందని చెప్పారు. దీంతో ఈ బాహుబలి బ్రాయిలర్ ని సొంతం చేసుకునేందుకు పోటీ మొదలైంది.

English summary
Turns out, this is a Broiler belongs to east godavari district, Andhra pradesh, one of the largest chicken in India. However, this Broiler is even more massive than most. "He weighs 10 kgs," owner told to the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X