నో డౌట్.. లెజెండ్‌ను దాటుతుంది: థియేటర్లో 'డిక్టేటర్' చూసిన బాలకృష్ణ
చిత్తూరు: నో డౌట్... డిక్టేటర్ సినిమా లెజెండ్‌ను మించి విజయం సాధిస్తుందని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం నాడు అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్‌లో బాలకృష్ణ అభిమానులతో కలిసి తాను నటించిన డిక్టేటర్ సినిమాను చూశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. డిక్టేటర్ సినిమాకు మంచి స్పందన లభిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తగిన రీతిలో డిక్టేటర్ సినిమా ఉందని, లెజెండ్‌ను మించిన విజయం లభించడం ఖాయమన్నారు. అభిమానులతో కలిసి సినిమా చూడటం కొత్త అనుభూతి కలిగించిందన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ తన బావ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందుకోసం ఆయన చిత్తూరు జిల్లా వచ్చారు. ఇందులో భాగంగా తిరుపతిలో సినిమా చూశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సంక్రాంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్న వేళ నేను నటించిన డిక్టేటర్ విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. బాలకృష్ణ సినిమా చూసిన అనంతరం తిరిగి నారావారిపల్లెకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications