Chiranajeevi and Balyya: చిరంజీవిపై బాలకృష్ణదే పైచేయి??
తెలుగు సినీరంగంలో కొన్ని దశాబ్దాలపాటు నువ్వా? నేనా? అన్నట్లుగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య సినిమాల విషయంలో హోరాహోరీ పోరు నడించింది. ఒకరు రికార్డులు సృష్టిస్తే మరొకరు రికార్డులు బద్దలు కొట్టేవారు. ఒకరు శతదినోత్సవ సినిమాలందిస్తే మరొకరు సిల్వర్‌జూబ్లీ సినిమాలందించేవారు. ఇదంతా తెరవరకే. బయటకు ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు.

రెండో ఇన్నింగ్స్ కష్టంగానే ఉంది
చిరంజీవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఖైదీ నెంబర్ 150 చేశారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు వినాయక్ దర్శకత్వం వహించడంతో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. తర్వాత చేసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య ఘోర పరాజయం పాలవడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చిరంజీవి సినిమాల లైనప్‌ను పరిశీలిస్తే చిరంజీవి అభిమానులకేకాదు, ఇతర కథానాయకుల అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఎవరు హిట్ ఇస్తారో అర్థం కావడంలేదు?
చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు మోహన్ రాజా. రీమేక్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైనప్పటికీ ఆయన్నుంచి హిట్ సినిమా వచ్చి చాలా కాలమైంది. అలాగే భోళాశంకర్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు, ఆయన వరుసగా నాలుగు ఫ్లాపులిచ్చారు. మెహర్‌తో సినిమా ఎలా ఒప్పుకున్నారంటూ ఇప్పటికే చిరు అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాను మైత్రీ మూవీస్ నిర్మాణంలో చిరు చేస్తున్నారు. దీనికి బాబీ దర్శకుడు. ఏదన్నా కాస్తంత ఆశ ఉందంటే ఈ ఒక్క సినిమా మీదే అభిమానులు ఆశపెట్టుకున్నారు. చిరంజీవి రెండో ఇన్నింగ్స్ బాగోలేదని అభిమానులే కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏ పాయింట్లు నచ్చి చిరంజీవి ఈ సినిమాలు చేస్తున్నారోననే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

బాలయ్య సూపర్‌హిట్ లైనప్
అఖండ భారీ విజయం సాధించిన తర్వాత నందమూరి బాలకృష్ణ NBK 107 పేరుతో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. యధార్థగాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగా సినిమా షూటింగ్ నుంచి లీకైన బాలకృష్ణ ఫొటో అంచనాలు పెంచేసింది. నల్ల చొక్కా, గోల్డ్ కలర్ లుంగీలో కుర్చీలో కూర్చొని ఉండగా, మళయాళ నటుడు లాల్ గొడుగు పట్టుకొని ఉన్నారు. ఈ స్టిల్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో
గోపీచంద్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయబోతున్నారు. ఇంతవరకు ఫ్లాప్ ఇవ్వని అనిల్ బాలయ్యతో ఒక డిఫరెంట్ మూవీ ప్లాన్ చేశానని, అభిమానుల అంచనాలను పెంచేలా ఉంటుందని ఇప్పటికే ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ సినిమా తర్వాత బాలయ్య మళ్లీ బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇలా బాలకృష్ణ సినిమాల లైనప్ చాలా బాగుందని, చిరంజీవి సినిమాల లైనప్ కన్నా బాలయ్యే పై చేయి సాధించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications