ఎన్టీఆర్ ట్వీట్‌కు సూపర్బ్ రిప్లై ఇచ్చిన బాలకృష్ణ కూతురు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ కూటమి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.మొన్నటి వరకు 151 స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. నాలుగు పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది. తిరుపతి, రాజంపేట .అరకు, కడప పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కూటమి విజయం సాధించడంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.

గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటోన్న జూనియర్ ఎన్టీఆర్ సైతం కూటమి విజయంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, తన అత్తయ్య పురందేశ్వరి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ఎంపీగా గెలిచిన భరత్‌కి కూడా అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఎన్టీఆర్ కూటమి విజయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్టుపై చంద్రబాబు కూడా స్పందిస్తూ థాంక్యూ బాబు అంటూ రిప్లై ఇచ్చారు.

Balakrishna s daughter gave reply to NTR tweet

అయితే వైజాగ్ ఎంపీగా గెలిచిన భరత్‌కి కూడా అభినందనలు తెలుపుతూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌‌కు రిప్లై ఇచ్చింది. ఎన్టీఆర్ కి రిప్లై ఇస్తూ థాంక్యూ తారక్ అన్న, రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమంతా కృత నిశ్చయంతో ఉన్నాం. దేవర సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ భరత్‌ పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి రావడం జరిగింది. ఎన్టీఆర్ భరత్‌కు బావ వరుస అవుతారు. కానీ ట్వీట్‌లో అన్న అని సంబోధించడంతో ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్ చేసింది బాలయ్య చిన్న కుమార్తె తేజశ్విని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భరత్ కనుక చేసి ఉంటే ఎన్టీఆర్ ని బావ అని పిలిచేవారు కదా అంటూ అభిమానులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+