బెట్టింగ్ యాప్‌లో టీడీపీ ఎమ్మెల్యే..?

బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తూన్న సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల యువత పూర్తిగా తప్పు దోవ పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్స్ యాప్స్‌పై ప్రత్యేక దృష్టిని సారించారు. దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.

హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌ ఖాన్‌, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.దీనిలో భాగంగానే విష్ణుప్రియ, రీతూ చౌదరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌‌, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హన్మంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా షెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు మొదలగు సినీ సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే , టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ పేరు కూడా తెర మీదకు వచ్చింది.

Balakrishna s name appears on screen in betting app promotion

అన్‌స్టాపబుల్ షోకు బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్నారనే సంగతి అందరికి తెలిసిందే. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ ఏ ముహూర్తానా అన్‌స్టాపబుల్ మొదలుపెట్టారో కానీ, ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోలకు సాధ్యం కాని విధంగా ఈ షోను ముందుకు నడిపిస్తున్నారాయన. ఇంకా చెప్పాలంటే ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా ఈ షో చూసిన తర్వాత బాలయ్యపై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ షో కారణంగా బాలకృష్ణ బెట్టింగ్ యాప్ వివాదంలో ఇరుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

అన్ స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్‌ను చూసి దాన్ని డౌన్ లోడ్ చేసుకుని రూ.80 లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు రాంబాబు అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు.ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని నిరూపించేందుకు ప్రభాస్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్‌లో బెట్టింగ్ యాప్‌ను ప్రమోషన్ చేశారని ఇది నిజమే అనడానికి ప్రభాస్, గోపీచంద్ కు బాలయ్య ఇచ్చిన ప్రజెంటేషన్‌పై ఫన్ 88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫొటోలను వైరల్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ ఈ షోకు కేవలం హోస్ట్ మాత్రమే. దీంతో ఆయన్ను విచారణకు పిలిచే అవకాశం లేదని తెలుస్తోంది. షో నిర్వహుకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+