బాలినేనితో రాజీ ఫార్ములా - లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..!!
మాజీ మంత్రి బాలినేని వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. వైసీపీని బాలినేని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం బాలినేని మాజీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఆఫర్ చేయగా తిరస్కరించారు. తన మద్దతు దారులతో సమావేశమైన బాలినేని కీలక నిర్ణయం దిశగా సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది.
బాలినేని మంత్రాంగం
వైసీపీ ముఖ్యనేత బాలినేని హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ మంత్రాంగం సాగిస్తున్నారు. పార్టీకి చెందిన ఒంగోలు కార్పోరేటర్లు..మద్దతు దారులతో సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీలో తన పరిస్థితిని వివరించారు. తనకు వస్తున్న పొలిటికల్ ఆఫర్స్ గురించి వారితో చర్చిస్తున్నారు. పార్టీలో కొనసాగాలంటే కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని బాలినేని వాపోయారు. బాలినేని ఈ నిర్ణయం తీసుకున్నా తామంతా మద్దతుగా నిలుస్తామని మద్దతు దారులు చెప్పినట్లు తెలుస్తోంది.

సీనియర్ల బుజ్జగింపులు
బాలినేని తాజాగా జగన్ గురించి వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వీటిని బాలినేని ఖండించారు. పార్టీలో వైవీ సుబ్బారెడ్డి తో బాలినేని సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ వద్ద ఈ అంశాలను ప్రస్తావించగా..అన్ని పరిష్కరించుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే బాలినేనికి జనసేన ముఖ్యుల నుంచి ఆఫర్ వచ్చిందని చెబుతున్నారు. అయితే, బాలినేని తన నిర్ణయం ఏంటనేది అధికారికంగా వెల్లడించలేదు. ఇటు తన మద్దతు దారులతో సమావేశమై చర్చిస్తున్న సమయంలోనే వైసీపీ నుంచి కొందరు ముఖ్యులు బాలినేనిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు.

బాలినేని నిర్ణయంతో
జగన్ తో ఉన్న బంధుత్వం కారణంగా ఇప్పటి వరకు వేచి చూసానని బాలినేని చెబుతున్నారు. ఈ సమయంలోనే బాలినేని వద్దకు వైసీపీ నేతలు రాజీ ఫార్ములాతో వచ్చారు. మాజీ మంత్రి విడదల రజనీ, బాలినేనితో సన్నిహితంగా ఉండే ఇద్దరు ఎమ్మెల్సీలు రాయబారం చేసారు. పార్టీలో కొనసాగాలని..బాలినేని ప్రస్తావిస్తున్న సొంత పార్టీ నేతల జోక్యం ఇక ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, దీంతో బాలినేని మొత్తబడలేదని సమాచారం. అయినా బుజ్జగింపులు కొనసాగుతున్నాయి,. దీంతో, ఇప్పుడు బాలినేని పార్టీని వీడే విషయంలో తుది నిర్ణయం పై సస్పెన్స్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications