వైసీపీకి బాలినేని గుడ్ బై - జగన్ కు రాజీనామ లేఖ..!!

అనుకున్నదే జరిగింది. వైసీపీకి సీనియర్ నేత బాలినేని గుడ్ బై చెప్పారు. జగన్ కు ఈ మేరకు రాజీనామా లేఖ పంపారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలిసి నడిచిన బాలినేని తాజా పరిణామాలతో మనస్థాపానికి గురయ్యారు. గత వారం జగన్ తో కలిసిన సమయంలో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత రాజీ ప్రతిపాదనలు వచ్చినా..తిరస్కరించారు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తూ జగన్ కు లేఖ రాసారు.

రాజీనామా
మాజీ మంత్రి బాలినేని వైసీపీ వీడారు. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి బాలినేని మద్దతుదారుగా ఉన్నారు. జగన్ కు బంధువు అయిన బాలినేని పార్టీ ఆవిర్భావం నుంచి తోడుగా నిలిచారు. బాలినేని నాలుగు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జగన్ హయాంలో మంత్రిగా పని చేసారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో జగన్ నాడు బాలినేనిని తప్పించి సురేష్ ను కొనసాగించారు. ఆ సమయంలోనే బాలినేని ఆగ్రహంతో దూరమయ్యారు. జగన్ బజ్జగింపులతో తిరిగి యాక్టివ్ అయ్యారు.

Balineni Srinivasa Reddy resign for YSRCP letter to YS Jagan

ఫలించని బుజ్జగింపులు
తాజా ఎన్నికల్లో బాలినేని ఒంగోలు నుంచి ఓడిపోయారు. ఓడిన తరువాత ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తి చేస్తూ న్యాయ పోరాటానికి దిగారు. తనకు ఈ పోరాటంలో పార్టీ నుంచి సహకారం లేదని ఆరోపించారు. ఇద అంశం పైన జగన్ ను కలిసారు. ఆ సమయంలో జగన్ మరోసారి బాలినేనిని బుజ్జగించారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. బాలినేని తిరస్కరించారు. తన ఆర్దిక పరిస్థితిని వివరించారు. తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేసారు. బాలినేనితో వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ రాయబారం నడిపారు. కానీ,బాలినేని మెత్తబడలేదు.

అడుగులు ఎటు
బాలినేని మద్దతు దారులు కొందరు ఇప్పటికే టీడీపీ, జనసేనలో చేరారు. ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ త్వరలో టీడీపీ ఖాతాలో జమ కానుంది. వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత కోసం జగన్ ప్రయత్నించారు. ఇక..తాజాగా మెగా కుటుంబం నుంచి నేరుగా ఆఫర్ రావటంతో బాలినేని ఆ పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బాలినేని పార్టీ మారటంతో గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సీనియర్ నేత బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పటంతో ప్రకాశం రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+