తెలంగాణ విచ్ఛిన్నానికి ఆ సంపాదన: బాబుపై సుమన్, ఎన్టీఆర్ ఫ్యామిలీకి సూచన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ శనివారం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపించారని ధ్వజమెత్తారు.
అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారు స్పందించకుంటే తెరాస కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు వెంటపడి తరిమేలా చేస్తారన్నారు.

ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయన చేతులు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, చంద్రబాబు కుట్రలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదుసార్లు జీవిత ఖైదు వేసినా సరిపోదన్నారు.
ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసు పెడితే తెలంగాణను లాగడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే ఆయనను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారని వారికి సేవ చేయాలన్నారు. అక్కడి ప్రజల సొమ్ముతోనే ఏపీ పోలీసులకు జీతాలు వస్తున్నాయని, వారిని రక్షించడానికే పని చేయాలన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications