త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తిట్టింది నేనే: బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని.. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల చివరివారంలో రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను బండ్ల గణేష్ అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో క్లిప్ వైరలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ గొంతు నాది కాదు అన్న బండ్ల తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ గొంతు తనదేనని ఒప్పుకోవడంతోపాటు త్రివిక్రమ్ కు సారీ చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయంద్వారా ఆయన మరోసారి వార్తల్లోకెక్కారు.

స్థలం విషయంలో తలెత్తిన వివాదం
ఎందుకు తిట్టారంటూ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా.. మనిషన్నాక కోపం రాదా? అని ప్రశ్నించాడు. భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరవెనక సహకారాన్ని అందించారు. తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. అటువంటిది వీరిద్దరి మధ్య పరిస్థితి ఎడముఖం.. పెడముఖం అన్నట్లుగా ఉంది. ఒక స్థలం విషయంలో ఇద్దరి మధ్యా వివాదం తలెత్తిందని బండ్ల సన్నిహితులు చెబుతుంటారు.

బండ్ల వస్తే ప్రచారం రాదన్న త్రివిక్రమ్?
పవన్ కు గబ్బర్ సింగ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అందించారు. భీమ్లానాయక్ ప్రి రిలీజ్ ఫంక్షన్ కు గణేష్ ను కూడా ఆహ్వానిస్తారని అందరూ అనుకున్నారు. కానీ చిత్రంగా గణేష్ కు ఆహ్వానం అందలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేది బండ్ల అభిప్రాయంగా ఉంది. ఒకవేళ బండ్లను పిలిస్తే ఆ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు వైరలవుతాయని, దీనివల్ల చిత్రానికి రావాల్సిన ప్రచారం రాదని, మైనస్ గామారుతుందనే ఉద్దేశంతో గణేష్ ను పిలవలేదని చెబుతుంటారు.

వైసీపీవారితో త్రివిక్రమ్ కుమ్మక్కయాడు?
గత ఫిబ్రవరి చివరివారంలో బయటకు వచ్చిన ఆడియోలో ఫోన్ చేసిన వ్యక్తి గణేష్ ను ఫంక్షన్ కు వెళుతున్నావా? అని అడుగుతాడు. ఇంకా ఆహ్వానం అందలేదని, డైలాగులు కూడా అద్భుతంగా రాసుకున్నానని, కానీ త్రివిక్రమ్ గాడు నన్ను రానివ్వకుండా చేయాలని చూస్తున్నాడు.. వైసీపీవారితో కుమ్మక్కయ్యాడు.. అని బదులివ్వగా.. పిలవకపోయినా వెళ్లొచ్చుగా అని ఎదురు వ్యక్తి ప్రశ్నిస్తాడు. పిలవకుండా వెళితే బాగోదని, వాడు డౌనవుతాడని నన్ను రావొద్దన్నాడంట.. అదే ఆలోచిస్తున్నాను అంటాడు. ఈ తరహా వ్యాఖ్యలతో బండ్ల గణేష్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే బండ్ల గణేష్ తన నోటిని అదుపులో ఉంచుకోవాలని అందరూ హితవు పలుకుతున్నారు. వివాదాల జోలికి వెళ్లకుండా కొన్నాళ్లు సైలెంటుగా ఉండాలని సూచిస్తున్నారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications