పడక పైనే ప్రేమ వివాహం - కాళ్లు విరగొట్టి కన్యాదానం - అనంతపురం జిల్లాలో వింత పెళ్లి
మిగతా అంశాలు పక్కన పెడితే, ప్రేమ విషయంలో ఎంతకైనా తెగిస్తుంది మన యువత. ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందనే ఆవేదనలో రచ్చకు దిగిన ఆ యువకుడు.. హింసాత్మక ఘటనల తర్వాతగానీ పేరెంట్స్ ను ఒప్పించిన ఆ అమ్మాయి.. ఎట్టకేలకు ఒక్కటయ్యారు. అయితే పీటల మీద కాకుండా పడక పైనే పెళ్లి చేసుకోవడంతో ఆ తంతు కాస్తా వింతగా మారి, వైరలైపోయింది. వివరాల్లోకి వెళితే..

ఎదురింటి అమ్మాయే..
అనంతపురం జిల్లా పామిడి మండలంలోని పి.కొండాపురం గ్రామం ఈ వింత పెళ్లికి వేదికైంది. స్థానికంగా నివసించే జగదీశ్ అనే యువకుడు.. ఎదురింట్లోని శ్రీలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలానికి ఆ అమ్మాయి కూడా అతనికి మనసిచ్చింది. కలిసి బతుకుదామని బాసలు చేసుకున్నారు. అదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు తెలియజేశారు. అబ్బాయి సైడ్ ఓకే, కానీ అమ్మాయి ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైంది..

వేరే యువకుడితో పెళ్లి..
జగదీశ్ తో ప్రేమ వ్యవహారం శ్రీలక్ష్మి కుటుంబానికి మింగుడుపడలేదు. అప్పటికప్పుడే వేరే సంబంధం చూసి కూతురికి లగ్గం ఖాయం చేశారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా జరిగాయి. పెద్దలను ఎదిరించలేక ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. జగదీశ్ మాత్రం ఆమెను వదులుకోవద్దని డిసైడ్ అయి, ఆ పెళ్లి జరగకుండా అడ్డుకున్నాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న శ్రీలక్ష్మి ఫ్యామిలీ సహనం కోల్పోయింది..

చావబాది.. స్టేషన్ కు వెళ్లారు..
పెళ్లిని అడ్డుకున్నాడనే కోపంతో జగదీశ్ పై శ్రీలక్ష్మి బంధువులు దాడికి పాల్పడ్డారు. అతణ్ని చావబాది, రెండు కాళ్లూ విరగొట్టి ఆస్పత్రిపాలు చేశారు. దాడి ఘటన తర్వాత ఈ వ్యవహారంలోకి పోలీసులు ఎంటరయ్యారు. రెండు పక్షాలను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. తాను జగదీశ్ నే ప్రేమిస్తున్నానని అందరిముందూ శ్రీలక్ష్మి తేల్చిచెప్పడంతో పెద్దలు ఎట్టకేలకు దిగొచ్చారు.

కాళ్లు విరిచినవాళ్లే కన్యాదానం..
జగదీశ్ పట్టుదల, శ్రీలక్ష్మి తెగింపుతో చివరికా ప్రేమజంటకు పెళ్లి జరిగింది. కాళ్లు విరగొట్టిన వాళ్లే కన్యాదానం చేసి నీళ్లు నెత్తిన చల్లుకున్నారు. కలిసి భోజనాలు చేసి కలహాలు మరిచిపోయారు. విరిగిన కాళ్లతో లేవలేని స్థితిలో ఉన్న జగదీశ్.. మంచంపైనే అమ్మాయికి తాళికట్టి తనదాన్ని చేసుకున్నాడు. నాటకీయంగా సాగిన వీళ్ల ప్రేమ కథ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications