ఇంట్లోనే బీర్ తయారీ.. క్షణాల్లో సిద్ధం!
ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రాందీ, విస్కీ లాంటివి తాగడానికి ఎక్కువమంది ఆసక్తి చూపరు. బీర్ తాగడానికి మాత్రం ప్రాధాన్యతనిస్తుంటారు. కొంతమంది వేడి తగ్గిద్దని తాగుతుంటారు.. మరికొందరు రంగు వస్తామని, గ్లామర్ పెరిగిద్దని, సన్నగా ఉన్నవారు లావు అవడానికి... ఇలా ఎవరికివారుగా బీర్ ను గట్టిగా లాగిచ్చేస్తుంటారు.
బీర్ లో సైడ్ డిష్ లు మాంచి క్రిస్పీగా ఉంటే మందుబాబులు సీసాల్లెక్కన కుమ్మేస్తారు. తాజాగా ఓ కంపెనీ ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ను తీసుకొచ్చింది. బయట షాపుల దగ్గరకు వచ్చి బీర్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే గ్లాస్ లో ఐస్ క్యూబ్ వేసుకొని క్షణాల్లో బీర్ పౌడర్ కలుపుకొని తాగేయవచ్చు.

జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్‌స్టంట్ కాఫీ పౌడరులాగా ఇన్‌స్టంట్ బీర్ పౌడర్‌ని తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్ల చల్లగా క్రిస్పీ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టొచ్చు. మిల్క్ షేక్ లా క్షణాల్లోనే తయారు చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఒక గ్లాస్ లో రెండు స్పూన్ల బీర్ పొడికి నీటిని జోడిస్తే చాలు. క్షణాల్లోనే బీర్ సిద్ధమవుతుంది.
బీర్ పౌడర్ ప్యాకెట్ల వల్ల టన్నుల కొద్దీ బీర్ సీసాలను రవాణా చేసే ఖర్చు తగ్గుతందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో బీర్ సీసా రవాణా చేయాలంటే అయ్యే ఖర్చుతో 45 గ్రాముల పౌడర్ వస్తుందని చెబుతున్నారు. బీర్ తో స్నానం చేయాలనుకునేవారికోసం కూడా బాత్ బీర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జర్మన్ కంపెనీ 42 రకాల బీర్లను అందిస్తోంది. గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్లను కూడా తయారు చేస్తోంది. సదరు జర్మనీ కంపెనీ పేర్కొంది












Click it and Unblock the Notifications