బీర్ ధరలు తగ్గుదల - ఏ బ్రాండ్ ఎంత..!!
బీర్ ప్రియులకు బిగ్ అప్డేట్. బీర్ ధరలు తగ్గనున్నాయి. అయితే, కొన్ని బ్రాండ్లకే అవి పరిమితం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన బీర్ బ్రాండ్ల మధ్య పోటీ పెరుగుతోంది. అమ్మకాలు పెంచు కొనేందుకు రెండు రాష్ట్రాల్లోని ఎక్సైజ్ శాఖ అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో నూ లిక్కర్ అమ్మకాలు 2024-25 ఆర్దిక సంవత్సరంగా భారీగా పెరిగాయి. ఇప్పుడు భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల బీర్ ధరలు తగ్గనున్నాయి. ఈ తగ్గింపు పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
తాజా ఒప్పందంతో
తెలుగు రాష్ట్రాల్లో బీర్ అమ్మకాలు ప్రతీ నెలా పెరుగుతున్నాయి. వేసవిలో బీర్ అమ్మకాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయిదు రకాల ప్రధాన బీర్ బ్రాండ్లకు ఇక్కడ భారీ డిమాండ్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు. రూ 99 క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభం తరువాత బీర్ విక్రయాల పైన కొంత మేర ప్రభావం పడింది. వేసవి మొదలు నుంచి తిరిగి అమ్మకాలు అంచనాల కు అనుగుణంగా కొనసాగుతున్నాయి. ఇక.. ఇప్పుడు బీర్ ధరలు తగ్గనున్నాయి. తాజాగా భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల బ్రిటన్ బీర్‌పై పన్ను ఏకంగా 75 శాతం తగ్గింది. దీని కారణంగా యూకే మేడ్ బీర్ల ధరలు తగ్గనున్నాయి.

ఎంపిక చేసిన బ్రాండ్లకే
తాజా ఒప్పందంతో బ్రిటన్ బీర్ బ్రాండ్లు ఇండియాలో చాలా చౌకగా మారతాయి. బ్రిటన్ బీర్‌తో పాటు అక్కడి స్కాచ్, విస్కీపై కూడా పన్ను తగ్గించారు. తద్వారా భారత్ మార్కెట్ లోనూ తక్కువ ధరకే లభిస్తాయి. అంటే ఇంతకుముందు రూ.200 ఉన్న బ్రిటన్ బీర్ బ్రాండ్లు తగ్గుముఖం పట్ట నున్నాయి. అయితే .. రూ 50 కే అందుబాటులోకి వస్తుందనేది మాత్రం వాస్తవం కాదని స్పష్టం చేస్తున్నారు. రూ 20 నుంచి రూ 35 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2024 లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు రూ.50,000 కోట్లు. ఇది ప్రతి సంవత్సరం సగటున 8-10శాతం వృద్ధి రేటును కలిగి ఉంది. కేంద్రం ఒప్పందం చేసుకున్నా.. ప్రతీ రాష్ట్రం తమ సొంత ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్నును ఖరారు చేస్తుంది. దీంతో, యూకే బ్రాండ్ల బీర్ ధరలు మాత్రం తగ్గనున్నాయి.












Click it and Unblock the Notifications