వీటి సాగుతో ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం
సాంప్రదాయ విధానానికి స్వస్తి పలికిన భజన్ లాల్ సేంద్రీయ ఎరువులతో కూరగాయలను పండిస్తున్నారు.
ఆరుగాలం శ్రమించి, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే అన్నదాత కునారిల్లిపోతాడు. అటువంటిై రైతుకు ఈరోజు వరకు మార్కెట్ లో ఏ పంటకు సరైన ధర లభించడంలేదు. కొంతమందిరైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదు. అయితే సాంప్రదాయ పంటలను పండించడంవల్ల ఇలా అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి పండిస్తారు. కొందరు రైతులు మాత్రం పక్కా ప్రణాళికతో వాణిజ్య పంటలను పండించి లక్షల రూపాయల లాభాలను గడిస్తున్నారు. రాజస్తాన్ లోని భరత్ పూర్ కు చెందిన ఓ రైతు సంవత్సరానికి నాలుగు పంటలు పండిస్తున్నారు. దీనిద్వారా అతను రూ.6 లక్షల ఆదాయం పొందుతున్నారు.
భరత్‌పూర్ జిల్లా కుమ్హెర్ మండలం బైలారా గ్రామానికి చెందిన భజన్ లాల్.. కొన్నాళ్లు సాంప్రదాయ పంటలనే పండించారు. గోధుమలు, ఆవాలు సాగుచేసేవారు. వాటితో ఆదాయం రాకపోతుండటంతోపాటు ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో తక్కువ రేటు లభించేది. ఇలా అయితే కష్టమని భావించిన భజన్ లాల్ కొత్త తరహా పంటలను పండించాలని నిర్ణయించుకొని ఒకే ఏడాది నాలుగు పంటలను సాగుచేయడం ప్రారంభించారు. ఏడాదికి రెండు చొప్పున.. ఒకే భూమిలో రెండు పంటలు వేస్తూ.. మొత్తం నాలుగు పంటలను సాగు చేస్తున్నాడు. ఈ విధానంతో భజన్ లాల్ ఆదాయం పెరగడంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయింది.

ముందుగా కూరగాయల్లో బెండ సాగు ప్రారంభించానని, దాని మధ్యలోనే పెసలు పండించానని ఆ రైతు తెలిపారు. పంట చేతికి వచ్చిన తర్వాత.. బెండకాయలను రూ.1.5 లక్షలకు, పెసర్లను రూ.35వేలకు విక్రయించారు. ఆ రెండు పంటలు పూర్తయిన తర్వాత టమోటా, కొత్తిమీర వేశారు. ఇందులో కొత్తిమీరను 85వేల రూపాయలకు అమ్మగా, టామోటా పంట కూడా సిద్ధంగా ఉందని త్వరలోనే మార్కెట్ కు తీసుకెళ్లి విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తోందని, సాగుకు ఎటువంటి క్రిమిసంహారక మందులను వాడనని చెప్పాడు. సేంద్రీయ ఎరువులనే ఉపయోగిస్తున్నారు. తన సాగు విధానాన్ని చూసిన తర్వాత చాలామంది అన్నదాతలు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారని, వారు కూడా ఏడాదికి నాలుగు పంటలు పండిస్తూ రెట్టింపు లాభాలను పొందుతున్నారని వెల్లడించారు. సాంప్రదాయ పంటల వెనకబడకుండా వాణిజ్య పంటలను సాగుచేస్తే లాభాలు గడించొచ్చని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications