వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: రంగంలోకి భూమా బ్రహ్మనందరెడ్డి, నంద్యాలలో పై చేయికి ప్లాన్, శిల్పాకు చెక్?

కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని టిడిపి నాయకత్వం ఇంకా తేల్చలేదు.అయితే ఈ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకొనేందుకుగాను భూమా కుటుంబం ప్రయత్నాలను

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని టిడిపి నాయకత్వం ఇంకా తేల్చలేదు.అయితే ఈ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకొనేందుకుగాను భూమా కుటుంబం ప్రయత్నాలను చేస్తోంది. భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మనందరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కర్నూల్ జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్తుగా మరణించారు. ఈ ఏడాది మార్చి నెలలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు.అయితే భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.

అయితే ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై టిడిపి నాయకత్వం తలలుపట్టుకొంటోంది. శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కూడ పోటీకి సై అంటున్నారు. అయితే ఈ రెండు కుటుంబాలతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చర్చలు జరుపుతున్నారు.

అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే పార్టీకి నష్టంవాటిల్లకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం చర్యలను చేపట్టింది.

నంద్యాల నియోజకవర్గంలో పట్టుకోసం భూమా బ్రహ్మనందరెడ్డి ప్రయత్నాలు

నంద్యాల నియోజకవర్గంలో పట్టుకోసం భూమా బ్రహ్మనందరెడ్డి ప్రయత్నాలు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టుకోసం భూమా బ్రహ్మనందరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. భూమా కుటుంబానికి టిక్కెట్టును కేటాయించాల్సి వస్తే భూమా బ్రహ్మనందరెడ్డిని ఆ కుటుంబం నుండి బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకే బ్రహ్మనందరెడ్డి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. భూమా అనుచరులు ఎవరూ కూడ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. భూమా ఇచ్చిన నిధులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అంటూ తన అనుచరులను అడిగి తెలుసుకొన్నారు. ఈ క్రమంలోనే రూ. కోటి విలువైన ప్రతిపాదనలు పంపిన గోస్పాడు, గోవిందపల్లె రోడ్డును ఆయన పరిశీలించారు.భూమాలేని లోటును తీర్చేందుకు శాయశక్తులా కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన కుటుంబం మొదటి నుండి రాజకీయాలతో సంబంధం ఉన్నందున అన్ని విషయాలపై తనకు అవగాహాన ఉందన్నారు బ్రహ్మనందరెడ్డి.

శిల్పాకు చెక్?

శిల్పాకు చెక్?

నంద్యాల ఎమ్మెల్యేగా ఉంటూ భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన వర్గీయులకు పెద్ద దిక్కులేకుండాపోయింది.అయితే భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు చంద్రబాబునాయుడు. ఆమె రాజకీయాలకు కొత్త. తల్లి మరణంతో ఆమె అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చారు.తండ్రి అనుభవాలతో ఆమె రాజకీయాల్లో పాఠాలు నేర్చుకొంటున్నారు.అదే సమయంలో భూమా నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియకు ఇబ్బంది ఏర్పడింది.ఈ తరుణంలోనే నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీకి బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపాలని ఆ కుటుంబం భావిస్తోంది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా అనుచరులు చెల్లాచెదురుకాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే నంద్యాల నియోజకవర్గంలో తామున్నామనే భరోసాను కల్పించేందుకు భూమా కుటుంబం ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు భూమా బ్రహ్మనందరెడ్డి నంద్యాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి భూమా అనుచరులను కలుస్తూ తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. భూమా కుటుంబం అండగా ఉంటామని భరోసా ఉంటే ఆయన అనుచరులు చెల్లాచెదురుకారు.ఇదే జరిగితే శిల్పా వర్గానికి కొంత దెబ్బే. రాజకీయంగా తమ ప్రాభవాన్ని నిలపుకొనేందుకుగాను భూమా కుటుంబం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఎవరెళ్ళినా పార్టీకి నష్టమే

ఎవరెళ్ళినా పార్టీకి నష్టమే

నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టు కేటాయింపు వ్యవహరం టిడిపికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా తయారైంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడితే టిడిపికి నష్టమే.అయితే అదే సమయంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టున్న భూమా కుటుంబం కూడ పార్టీకి దూరమైతే పార్టికి నష్టమే.అయితే భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఏపీ టూరిజంమంత్రిగా ఉన్నారు.భూమా కుటుంబాన్ని కాదని శిల్పా మోహన్ రెడ్డికి టిక్కట్టు కేటాయిస్తే భూమా కుటుంబం ఏ మేరకు సహకరిస్తోందోననే చర్చ కూడ లేకపోలేదు.అయితే రెండు కుటుంబాల మద్య ఉన్న విబేధాలను కూడ మర్చిపోయి శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా భూమా నాగిరెడ్డి పనిచేసిన విషయాన్ని భూమా కుటుంబసభ్యులు గుర్తుచేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల నాటికి నియోజకర్గాల పునర్విభజన జరిగితే ఈ సమస్య తీరిపోనుందని టిడిపి భావిస్తోంది.అయితే ఈ లోపుగా వచ్చే ఉప ఎన్నికల్లో రెండు వర్గాలను సంతృప్తిపర్చే రాజీమార్గం కోసం టిడిపి నాయకత్వం ఆలోచిస్తోంది.

వ్యూహా ప్రతి వ్యూహాల్లో టిడిపి, వైసీపీలు

వ్యూహా ప్రతి వ్యూహాల్లో టిడిపి, వైసీపీలు

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు అధికార టిడిపి, విపక్ష వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. టిడిపిలోని రెండు వర్గాలు టిక్కెట్టును ఆశిస్తున్నాయి.అయితే రెండు వర్గాల మద్య రాజీకుదిర్చేందుకుగాను టిడిపి నాయకత్వం ప్రయత్నాలను సాగిస్తోంది.అయితే టిడిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ కూడ వ్యూహాలను రచిస్తోంది. టిడిపిని వీడి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది.అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారకుండా తాత్కాలికంగా పార్టీ నాయకత్వం నిలువరించగలిగింది.అదే సమయంలో నంద్యాల టిక్కెట్టుపై గతంలో ఉన్న ఆశలు భూమా కుటుంబానికి కన్పించడం లేదు. శోభానాగిరెడ్డి వర్థంతి రోజున నంద్యాల నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని ప్రకటించకుండా టిడిపి నాయకత్వం నిలువరించగలిగింది.టిడిపిలోని అంతర్గత సమస్యలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపి ప్రయత్నిస్తోంది.అయితే
ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా టిడిపి చెక్ పెడుతోంది.

పట్టువీడని ఇరువర్గాలు

పట్టువీడని ఇరువర్గాలు

నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే విషయంలో శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబసభ్యులు పట్టు వీడడం లేదు. ఈ రెండు వర్గాలు కూడ పోటీకి సై అంటున్నాయి.అయితే రెండు వర్గాలు చేస్తున్న వాదన కూడ సహేతుకంగానే కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగినందున, ఉప ఎన్నికల్లో తనకు పోటీచేసే అవకాశం కల్పించాలని శిల్పా మోహన్ రెడ్డి కోరుతున్నారు.అయితే ఎమ్మెల్యే లేదా ఎంపి చనిపోతే ఉపఎన్నికలు జరిగితే ఆ కుటుంబానికి చెందినవారిని బరిలోకి దింపాలనే సంప్రదాయాన్ని పాటిస్తున్న విషయాన్ని భూమా కుటుంబం గుర్తు చేస్తోంది. దీంతో ఈ రెండు కుటుంబాలు కూడ పోటీకి సై అంటున్నాయి.

English summary
Bhuma Brahmananda reddy visiting Nandyal assembly constituency.Our family behind everyone he assured to Bhuma followers. Bhuma family and silpa mohan reddy also prepare for contest in Nandyala by poll
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X