జనసేనకు గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో భారీ ఊరట..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష జనసేన పార్టీకి అతిపెద్ద టెన్షన్ తీరిపోయింది. జనసేనకు గతంలో ఈసీ కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఆ తర్వాత ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచడంతో దాన్ని తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచాణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు రెండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.

big relief to pawan kalyan s janasena party in ap high court over glass tumbler symbol

జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినందున తాము ఎన్నికల వేళ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లను తిరస్కరించింది.

ఎన్నికల సమయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై విచారణ నేపథ్యంలో జనసేన పార్టీలో టెన్షన్ నెలకొంది. హైకోర్టు నిర్ణయంలో తేడా వస్తే ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని ఆందోళనలో ఉన్నారు. కానీ హైకోర్టు జనసేనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వారికి భారీ ఊరట లభించినట్లయింది. హైకోర్టు తీర్పుతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన పార్టీ అభ్యర్ధులు గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేసే అవకాశం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+