Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు బిగ్ షాక్..!

మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు బిగ్ షాక్ తగిలింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నేడు ( ఆగస్టు 25, 2025 ) సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ ప్రక్రియ మంగళవారానికి ( ఆగస్టు 26, 2025 ) వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ఎంపిక అయిన అభ్యర్ధులు అసహనం వ్యక్తం చేస్తుండగా.. కాల్ ‌లెటర్లు జారీ చేయడంలో ఆలస్యం తలెత్తడంతో షెడ్యూల్‌ను మార్చవలసి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.

ఇక ఇప్పటికే డీఎస్సీ మెరిట్‌ జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అభ్యర్థులు సాధించిన స్కోరు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. రిజర్వేషన్లు, స్థానికత వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్‌లెటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో కాల్‌లెటర్లు అందుబాటులో ఉంటాయని సమాచారం.

big-shock-for-the-candidates-selected-in-mega-dsc

కాగా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా న్యాయంగా నియామక ప్రక్రియ పూర్తయ్యేలా విద్యాశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాబితాలను ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత నిర్ణయించిన ప్రకారం ఆదివారం నుంచే అభ్యర్థుల లాగిన్‌కి కాల్‌లెటర్లు పంపి, సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సి ఉండగా, కాల్‌లెటర్ల అప్‌లోడ్‌లో ఆలస్యం కారణంగా పరిశీలనను ఒకరోజు వాయిదా వేశారు.

అయితే మంగళవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అధికారికంగా ప్రారంభం కానుంది. అభ్యర్థులు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలను ఇప్పటికే పోర్టల్‌లో అప్డేట్ చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే హెల్ప్‌డెస్క్‌ ద్వారా పరిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో పాటు ఫోటోకాపీలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే అభ్యర్థులకు తుది ఎంపిక జాబితా విడుదల కానుంది. అనంతరం ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ చేసి, సంబంధిత పాఠశాలల్లో నియామకాలను చేపడతారు.

ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్ధవంతంగా ఎగ్జామ్ పూర్తి చేసి ఫలితాలను రిలీజ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+