భారతదేశంలో అతి పెద్ద రైల్వేస్టేషన్

బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన భారతీయ రైల్వే రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటూ వెళుతోంది. స్వాతంత్ర్యం రాకముందు 55వేల కిలోమీటర్ల రైల్వే లైను ఉండగా, నేటికి 1.30 లక్షల కిలోమీటర్ల రైల్వే నెట్ వర్క్ భారతీయ రైల్వే సొంతం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థ కూడా భారతీయ రైల్వే కావడం విశేషం. డబుల్ ట్రాక్స్ నిర్మిస్తూ, రద్దీ ఉన్నచోట మూడోలైను నిర్మిస్తూ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందిస్తోంది భారతీయ రైల్వే. మనదేశంలో అనేక రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో విశిష్టత ఉంది. ఇలాంటి విశిష్టతలు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉండే రైల్వేస్టేషన్లకు ఉండవు.

ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది
ప్లాట్‌ఫామ్ పొడవు... ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫామ్ కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌లో ఉంది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. రద్దీ... ప్రయాణికుల సంఖ్య ఆధారంగా చూస్తే, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్షన్, సీల్దా స్టేషన్లు అతిపెద్దవిగా చెప్పవచ్చు. చారిత్రక ప్రాముఖ్యత... ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ తన అద్భుతమైన నిర్మాణం, చారిత్రక ప్రాముఖ్యత వల్ల ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. పేరు లేని రైల్వేస్టేషన్, ప్రకృతి సోయగాల మధ్య ఉండే రైల్వేస్టేషన్లు, దట్టమైన అడవుల్లో నిర్మించి రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి.

biggest railway station in india details here

సికింద్రాబాద్ కూడా అత్యంత రద్దీగా ఉంటుంది
హౌరా జంక్షన్, కోల్‌కతా... భారతదేశంలోనే అతిపెద్ద రద్దీ స్టేషన్‌లలో ఒకటి. సీల్దా స్టేషన్, కోల్‌కతా... కోల్‌కతాలోని మరో ప్రధాన రైల్వే టెర్మినల్. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబయి... ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చారిత్రక స్టేషన్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్: భారతదేశ రాజధానిలోని ప్రధాన రైల్వే స్టేషన్.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, చెన్నై... దక్షిణ భారతదేశంలోని ప్రధాన రైల్వే టెర్మినల్. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. దక్షిణ భారతదేశంలో తీవ్ర రద్దీ ఇక్కడ నెలకొంటుంది. విజయవాడ జంక్షన్ దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన రైల్వేజంక్షన్. ఇక్కడి నుంచి అన్ని మార్గాలకు రైళ్లు ప్రయాణిస్తుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+