ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కామన్ మ్యాన్ - అనూహ్య ఎంపిక..!?

ఏపీ లో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలని ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తోంది. కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతల పైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పలువురు పేర్లు రేసులో ఉండగా.. బీజేపీ నాయకత్వం మాత్ర సామాన్య కార్యకర్తకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

ఏపీలో బీజేపీ కొత్త అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కొనసాగుతోంది. కేంద్రం నుంచి ఈ మధ్య కాలంలో ఏపీకి భారీగా సాయం అందుతోంది. దీంతో, ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. తాజాగా అమిత్ షా విజయవాడ పర్యటన సమయంలో పార్టీ నేతలకు అమిత్ షా తమ వ్యూహం స్పష్టం చేసారు. పార్టీ బలోపేతం పైనే నేతలంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో బీజేపీ సంస్థాగత బలోపేతం పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి చేసారు. ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది.

BJP huge move common party worker to lead AP s saffron party

పలువురు ముఖ్య నేతలు పేర్లు అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్నాయి. పార్టీ నాయకత్వం సైతం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. పురందేశ్వరిని కొనసాగించాలా ... లేక, కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనేది హైకమాండ్ పరిశీలిస్తోంది. కాగా, పార్టీకి సుదీర్ఘ కాలం పని చేసిన సాధారణ కార్యకర్తకు పార్టీ నాయకత్వం అప్పగించాలనేది తాజా ప్రతిపాదన వచ్చినట్లు ఢిల్లీ నేతల సమాచారం. ఇందు కోసం ఏబీవీపీ, బీజేపీ యువమోర్చాలో పని చేసి... బీజేపీలో పని చేస్తున్న ఉత్తరాంధ్ర కు చెందిన ఒక బీసీ నాయకుడి పేరు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రిగా సీనియర్ కార్యకర్త శ్రీనివాస వర్మకు అవకాశం ఇచ్చిన విధంగానే ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలోనూ ఇదే రకంగా వ్యవహరించాలని భావిస్తున్నారని చెబుతున్నారు.అయితే, ఏపీలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ అధ్యక్ష విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+