నిన్న జనసేన, నేడు బీజేపీ ..'పుష్ప-2'పై రాజకీయ దాడి, అరెస్ట్ చేయాలంటూ
సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో 'పుష్ప-2'పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గురువారం(డిసెంబర్ 5)న సినిమా వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

ఇదిలా ఉంటే 'పుష్ప-2'పై రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే 'పుష్ప-2' సినిమాను ఆంధ్రప్రదేశ్ లో అడ్డుకుంటామని జనసేన గన్నవరం నియోజకవర్గం నేత చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు. తాజాగా బీజేపీ సైతం 'పుష్ప-2' విమర్శలు గుప్పించింది. తాజాగా సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.పుష్ప సినిమాలో చూపించింది అబద్ధం అంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఎర్రచందనం టన్ను 10 లక్ష రూపాయలు ఉంటే.. కోటి రూపాయలుగా చూపించారు. దీంతో యూత్ చెట్లను నరుకుతున్నారు.
దీనివల్ల యువకులు కోట్లాది రూపాయలు సంపాదించాలన్న ఆశతో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్లు పైడి ఆరోపించారు. పుష్ప సినిమా మొదటి పార్ట్ వల్లే అంతటి అనర్ధం జరిగితే ఇక పుష్ప-2 కూడా రిలీజయితే ఇంకెన్నిఅనర్ధాలు జరుగుతాయో అని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సినిమాతో యువత పాడైపోతున్నట్లు చెప్పారు. అందుకనే సినిమాలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ను అరెస్టుచేసి జైలులో వేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ సినిమాపై సెటెర్లు వేశారు. బీజేపీ ఎమ్మెల్యే సైతం ఇదే తరహా కామెంట్స్ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications