• search

ఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   BJP MP Haribabu Press Meet On AP Projects With Statistics

   న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామిలను అమలుపరచడంలో కేంద్రం ఏపీని వంచించిందన్న ఆరోపణలకు బీజేపీ ఎంపీ హరిబాబు లెక్కలతో సహా అన్ని వివరాలు బయటపెట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏ కేంద్ర ప్రభుత్వం.. ఏ రాష్ట్రానికి చేయని రీతిలో మోడీ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాల కోసం నిధులు కేటాయించిందన్నారు.

   విభజన హామిలన్నింటిని చిత్తశుద్దితో అమలు చేస్తున్నామని, ఇప్పటికీ ఆ హామిలకు తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ హరిబాబు, బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు స్పష్టం చేశారు. ఏపీకి మోడీ ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంపై ఢిల్లీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు హరిబాబు.

   ఇప్పటిదాకా చేసినవి..:

   ఇప్పటిదాకా చేసినవి..:

   • రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటుంది.
   • 10 నెలల రెవెన్యూ లోటును త్వరలో భర్తీ చేస్తారు.
   • రవాణా రంగంలో 3700కి.మీ రహదారుల కోసం లక్ష కోట్లు కేటాయించాం.
   • ఏపీకి 6.8 లక్షల ఇళ్లను మోడీ ప్రభుత్వం కేటాయించింది.
   • ఉజ్వల్‌ వంటి కేంద్ర పథకాలను ఏపీ సమర్థంగా వినియోగించుకుంటోంది.
    పోలవరానికి ఇదీ మేం చేసింది:

   పోలవరానికి ఇదీ మేం చేసింది:

   పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది అని ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.పోలవరం నిర్మాణానికి రూ.4వేల కోట్లు కేంద్రం ఇప్పటికే చెల్లించింది. నాబార్డ్ కూడా ఆర్థిక సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం.

   విభజన చట్టంలో పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణకు కేటాయించి కాంగ్రెస్ అన్యాయం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా సరే, ఆ ముంపు గ్రామాలను ఏపీలో కలిపి పోలవరం నిర్మాణానికి మార్గం సుగమం చేశాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పోలవరంపై మా చిత్తశుద్దికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?..

    రెవెన్యూ లోటుకు ఇలా చర్యలు:

   రెవెన్యూ లోటుకు ఇలా చర్యలు:

   • పార్లమెంటులో ఆందోళనల సందర్భంగా.. కేంద్రం అందించబోయే సహాయంపై స్పష్టత లేదని టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారు. అందులో రెవెన్యూ లోటు ఒకటి.
   • ఐదు సంవత్సరాలకు సంబంధించిన రెవెన్యూ లోటు దాదాపు రూ.20వేల కోట్లు వస్తుందని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.
   • ఆర్థిక సంఘం సిఫారసుకు అనుగుణంగా రూ.4వేల కోట్లు ఇప్పటికే కేంద్రం మంజూరు చేసింది.
   • ఇంకా ఎంత ఇవ్వాలనే దానిపై ఒక అంగీకారం కోసం ప్రయత్నం జరుగుతోంది.
   • 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6వేల కోట్లు లోటు ఉంటుందని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. పరస్పర అంగీకారంతో రెవెన్యూ లోటు చెల్లిస్తాం.
   విద్యుత్ విషయంలో:

   విద్యుత్ విషయంలో:

   దేశంలో మూడు రాష్ట్రాలకు నిరంతరాయ విద్యుత్ ప్రతిపాదన చేసిన ఎన్డీయే.. అందులో ఏపీని కూడా చేర్చింది. అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టులు కూడా మంజూరు చేయించింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లో 24గం. విద్యుత్ సరఫరా అవుతోంది. తద్వారా పరిశ్రమలకు విద్యుత్ కొరత అనే సమస్య తీరింది.

    ప్రత్యేక హోదా..:

   ప్రత్యేక హోదా..:

   ప్రత్యేక హోదా ప్రకటించిన నేపథ్యంలో.. హోదా వల్ల ఎంత లాభం చేకూరుతుందో.. అంతే ప్రయోజనాన్ని ఒక్క రూపాయి కూడా నష్టం లేకుండా చేయడానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయం తీసుకుంది. హోదా ద్వారా 90శాతం, హోదా లేకపోతే 60శాతం గ్రాంట్స్ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతాయి. ఆ లోటును ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి అందించేందుకు కేంద్రం అంగీకరించింది.

    ఆ ఐదు త్వరలోనే చేపడుతాం..:

   ఆ ఐదు త్వరలోనే చేపడుతాం..:

   పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలను ఏర్పాటు చేస్తున్నాం. వాటి పని కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఐదు సంస్థల విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉంది.

   • దుగరాజ పట్నం ఓడరేవు,
   • విశాఖ రైల్వే జోన్,
   • కేంద్రీయ విశ్వవిద్యాలయం.
   • గిరిజన యూనివర్సిటీ,
   • కడప స్టీల్ ప్లాంట్.

   వర్సిటీల కోసం పార్లమెంటులో బిల్లు చేయాల్సిన అవసరం ఉంది. కానీ బిల్లుతో సంబంధం లేకుండానే బడ్జెట్‌లో రూ.10కోట్లు నిధులిచ్చాం.

    ఇవీ జరగాల్సి ఉన్నాయి..:

   ఇవీ జరగాల్సి ఉన్నాయి..:

   దుగరాజ పట్నం ఓడరేవు విషయంలో అభ్యంతరాల రీత్యా ప్రత్యామ్నాయం కోసం చర్చలు జరుగుతున్నాయి.

   విశాఖ రైల్వేజోన్ కోసం సరిహద్దులు ఏవిధంగా నిర్ణయించాలో చర్చించి ప్రకటిస్తాం.
   వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు.. చట్టంలో పేర్కొనబడని కంపెనీలు కూడా ఏపీకి వచ్చేలాగా ఆయన చర్యలు తీసుకున్నారు.
   పెట్రోలియం రంగంలో లక్ష కోట్ల ప్రతిపాదనలు చేశాం..
   పెట్రోలియం కాంప్లెక్స్ మీద కూడా చర్చ జరుగుతోంది.

    రాజధాని నిర్మాణం.. మెట్రో ప్రాజెక్ట్..:

   రాజధాని నిర్మాణం.. మెట్రో ప్రాజెక్ట్..:

   విజయవాడ మెట్రో రైలు డీపీఆర్ ఆమోదం చెందింది. విశాఖవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుతాయి.

   రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ.2500కోట్లు కేటాయించాం.
   కృష్ణా, గోదావరిల్లో చమురు నిక్షేపాల కోసం ఓఎన్జీసీ లాంటి సంస్థల్ని తీసుకొస్తున్నాం..
   అంతర్గత జలరవాణా కోసం 7వేల కోట్లు కేటాయించాం..

   తప్పుంటే ప్రశ్నించండి..:

   తప్పుంటే ప్రశ్నించండి..:

   93వ ఆర్టికల్ ప్రకారం.. విభజన చట్టంలో పేర్కొనబడిన సంస్థల ఏర్పాటు, డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు 10ఏళ్ల టైమ్ ఇచ్చారు. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే చాలా హామిలకు నిధులు కేటాయించాం. మిగిలిన వాటికి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కేటాయింపులు ఉంటాయి.

   భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ కేంద్రం ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చేయని రీతిలో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాం. రాజకీయ పరిశోధన చేసే ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా సరే దీన్ని పరిశీలించవచ్చు. నేను చెప్పినవాటిల్లో ఏదైనా తప్పు ఉంటే.. నన్ను ప్రశ్నించండి. వాటికి సమాధానం చెప్పడానికి నేను సిద్దంగా ఉన్నా.

   English summary
   BJP MP Haribabu given clarification on Andhrapradesh projects with statistics. Haribabu said still we are committedly working for AP promises

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more