క్రియాశీలక రాజకీయాలకు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే గుడ్ బై..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికల వ్యూహాల పై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ముఖ్య నేతలు కీలక నిర్ణయాలను ప్రకటి స్తున్నారు. కూటమిలో భాగంగా బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన సీనియర్ నేత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అంతే కాదు, క్రియాశీలక రాజకీయాల నుంచి దూరం అవుతున్నట్లు వెల్లడించారు. అదే బాటలో మరో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఏపీ రాజకీయాల్లో ఈ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి.
ఏపీలో బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాజకీయాల నుంచి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారు. వారిలో ఒకరు అధికారికంగా ప్రకటించగా.. మరో నేత సంకేతాలు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి లెక్కల్లో భాగంగా బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వారిలో ఒకరైన మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు.

రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడో అనుకున్నానని, కానీ అందరూ కోరుకోవడంతో పాటు బలవంతం చేయడంతోనే 2024 ఎన్నికల్లో పోటీ చేశానని ఆయన అన్నారు. అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. కాగా.. తాను కానీ, తన కుటుంబంలో, ఎవరూ కానీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోమని కామినేని స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి, సమాజానికి ఉపయోగపడేలా పేరు తెచ్చుకుంటా నని కామినేని చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్ వద్ద జరిగిన సినిమా పరిశ్రమ సమావేశంలో చిరంజీవి సహా ఇతర ప్రముఖులు హాజరు.. చోటు చేసుకున్న ఘటన పైన సభలో కామినేని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కామినేని కామెంట్స్ కు కౌంటర్ గా వెంటనే నందమూరి బాలయ్య స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది.
ఆ తరువాత తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు కామినేని ప్రకటించారు. 2014 లో బీజేపీ - టీడీపీ పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చిన సమయంలో కామినేని నాడు చంద్రబాబు ప్రభుత్వం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసారు. ఎన్డీఏ నుంచి నాడు టీడీపీ బయటకు వచ్చిన సమయం లో మంత్రి పదవి వీడారు. అయితే.. అదే విధంగా బీజేపీలో తన అభిప్రాయాలను స్పష్టం చెప్పే మరో ముఖ్య నేత సైతం వచ్చే ఎన్నికల నుంచి పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.
-
వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్- ఆరు నెలల జైలుశిక్ష..! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications