బిజెపి వ్యూహం: ఎపిలో యుపి సెంటిమెంట్ దెబ్బ, పనిచేస్తుందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఉత్తరప్రదేశ్ సెంటిమెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది. దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే బిజెపి కార్యకర్తలకు గ్రామాలకు తరిలారు. వారికి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఎబివిపి వంటి సంస్థలు తోడయ్యాయి. పక్కా ప్లాన్‌తో వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేశారు.

 యుపిలో బిజెపికి బలం ఉంది...

యుపిలో బిజెపికి బలం ఉంది...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి తగిన బలం, క్యాడర్ ఉన్నాయి. అఖిలేష్ కుటుంబంలో తగాదాలు చోటు చేసుకన్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అవి బిజెపికి కలిసి వచ్చాయి. దానికితోడు స్థితిలో నియోజకవర్గాల్లో బిజెపి పూర్తి స్థాయి కార్యకర్తలను నియమించింది. వారికి మోటార్ సైకిళ్లు ఇచ్చింది. దీంతో పకడ్బందీగా ఎన్నికల వ్యూహరచనను అమలు చేసింది. పూర్తి స్థాయి కార్యకర్తలు అన్ని గ్రామాల్లో తిరుగుతూ బూత్ కమిటీలతో కలిసి పనిచేశారు. ఇది ఉపయోగపడింది.

 ఎపి ఎన్నికలకు సమయం...

ఎపి ఎన్నికలకు సమయం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 16 నెలల కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 సైకిళ్లను తెప్పించింది. వాటిని విజయవాడలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. ఎపిలోని 75 నియోజకవర్గాల్లో కూడా బిజెపి పూర్థి కాలం కార్యకర్తలను నియమించి, వారికి మోటారు సైకిళ్లను ఇస్తారు. పార్టీ నేతల ఇళ్లల్లోనే వారికి అద్దెకు గది, భోజన వసతి కల్పిస్తున్నారు. ఇప్పటికే 30 మంది పూర్తి కాలం కార్యకర్తలను నియమించారు.

 వారికి సంబంధం లేకుండా..

వారికి సంబంధం లేకుండా..

ఫుల్ టైమర్లు నియోజకవర్గం నేతలతో సంబంధాలు లేకుండా నేరగా విజయవాడలోని రాష్ట్ర కార్యాలయం పర్యవేక్షణలో పనిచేస్తారు. ప్రతి రోజూ ఒక గ్రామానికి లేదా పట్టణాల్లోని ఒక వార్డుకు వెళ్లి పనిచేస్తారు. అక్కడి నేతలతో కలిసి పనిచేస్తారు. బూత్ కమిటీలను వేస్తారు.

బిజెపి తెలుగుదేశంతో

బిజెపి తెలుగుదేశంతో

ఇప్పటికీ బిజెపి తెలుగుదేశంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. అయితే,టిడిపితో సంబంధం లేకుండా కింది స్థాయి వరకు విస్తరించాలనే వ్యూహంతో బిజెపి పనిచేస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేస్తుందా, బలాన్ని చూపించి ఎక్కువ సీట్లను తెలుగుదేశం నుంచి రాబట్టేందుకు ప్రయత్సిస్తుందా అనేది తెలియడం లేదు.

  గుజరాత్ BJP ఎఫెక్ట్ : 2018, 2019 ఎన్నికలపై ప్రభావం, జగన్ కి కలిసొచ్చే అంశమే !
   అయితే, బిజెపి వ్యూహం పనిచేస్తుందా..

  అయితే, బిజెపి వ్యూహం పనిచేస్తుందా..

  యుపి వ్యూహాన్ని అనుసరించినంత మాత్రాన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాన్ని సాదిస్తుందా అనేది సందేహమే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. పైగా, ఎపి సమస్యలను అన్నింటికీ కేంద్రాన్నే ఎత్తిచూపుతూ చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP has planned to implement Uttar Padesh strategy in Andhra Pradesh in coming elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి