బయటపడ్డ బోటు రెయిలింగ్ : మరో రెండురోజుల పాటు ప్రయత్నం

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం తన ప్రయత్నాలు ప్రారంభించించిన విషయం తెలిసిందే... మూడవ రోజు కూడ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే బుధవారం చేసిన ప్రయత్నాల్లో బోటు వెలికితీతపై కొంత సానుకూల పరిణామాలు జరిగాయి. బుధవారం గోదావరిలో మునిగిన బోటు లంగరుకు తగిలిందని సత్యం బృందం తెలిపింది. అయితే రోపును ప్రోక్లైనర్‌ బలంగా గుంజడంతో జారీపోయినట్టు తెలిపారు. ఈ ప్రయత్నంతో సుమారు 500 మీటర్ల వరకు తీరం వైపు కదిలిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బోటుకు ఉన్న తెల్లని కలర్ నీళ్లపై తేలినట్టు తెలిపారు. దీంతో మరో రెండురోజుల పాటు బోటు వెలికి తీత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.

అయితే గురువారం చేపట్టిన ప్రయత్నాల్లో బోటు రెయిలింగ్ తగిలింది. దీంతో దాన్ని బయటకు తీశారు. దీంతో బోటును వెలికి తీస్తారనే నమ్మకం కల్గింది. ఈనేపథ్యంలోనే రెండురోజుల పాటు వెలికితీత ప్రయత్నాలు కొనసాగనున్నట్టు చెప్పారు. అయితే బోటుకు లంగరును వేసేందుకు గజ ఈతగాళ్లు అంగీకరిస్తే... వారి ద్వార బోటుకు లంగరును వేసేప్రయత్నం చేస్తామని చెప్పారు. లేదంటే ప్రస్తుతం చేపడుతున్న విధానం ద్వారనే వెలికితీత పనులు కొనసాగిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రోక్లైనర్‌తో పాటు, మూడు వేల అడుగుల ఐరన్ రోప్‌తో పాటు ఇతర నైలాన్ తాళ్లను కూడ ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. కాగా గతంలో మూడు రోజుల పాటు లంగర్లు వేసి బోటును వెలికితేసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు.

Boat efforts ended on the third day also and no results

సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+