బాడీగార్డుల కోసం మన హీరోలు పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా?
కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోలు, హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ కు వెళ్లినప్పుడు జనాలను నియంత్రించడం చాలా కష్టమవుతుంటుంది. ఆటోగ్రాఫ్ ల కోసం అభిమానులు ఒక్కసారిగా మీద పడిపోతుంటారు. ఒకటి రెండు సినిమాలు చేసినవారే వారి వారి స్థాయిలకు తగ్గట్లుగా బౌన్సర్లను, బాడీగార్డ్స్ ను నియమించుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా అభిమానులున్న పాన్ ఇండియా స్టార్లు తమ భద్రత కోసం బాడీగార్డులకు ఎంత జీతాలు చెల్లిస్తున్నారో తెలుసుకుందాం.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డెత్ వార్నింగ్స్ ను ఎదుర్కొంటున్నాడు. తన భద్రత కోసం బాడీగార్డులపై సంవత్సరానికి రూ.2 కోట్లు వ్యయం చేస్తున్నాడు.దేశంలోనే అత్యంత ఖరీదైన హీరోయిన్ గా దీపికా పదుకొనే ఉంది. రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న దీపికకు ఒక స్టార్ హీరోతో సమానంగా ఫాలోయింగ్ ఉంది. తాజాగా పఠాన్ సినిమాతో హిట్ కొట్టింది. తన బాడీగార్డుల కోసం సంవత్సరానికి రూ.1.2 కోట్లు చెల్లిస్తుంది. అభిమానుల గుండెల్లో అందాలతారగా వెలుగొందుతున్న దీపిక ఆ మాత్రం ఖర్చుచేయడంలో తప్పేం లేదనేది ఆమె అభిమానుల అభిప్రాయంగా ఉంది.

విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సైతం ఏడాదికి రూ. 1.2 కోట్లు బాడీగార్డ్స్‌కు ఖర్చు పెడుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్రికెటర్ భార్య కావడం, బాలీవుడ్ హీరోయిన్ అవడంతో బాడీగార్డులపై ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందేననే అభిప్రాయం వినపడుతోంది.
దశాబ్దాలుగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌కు మకుటంలేని మహారాజుగా బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ విరాజిల్లుతున్నారు. ఆయన చేతి స్పర్శ తాకితేనే అభిమానులు చాలునకుంటున్నారు. బాడీగార్డులు లేకుండా బహిరంగ ప్రదేశాలకు రావడం అసాధ్యం. అందుకే ఆయన సంవత్సరానికి రూ.2.7 కోట్లు ఖర్చుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications