నన్ను అంతం చేయాలని కుట్ర - బొత్స సంచలనం..!!

శాసనమండలి విపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిగత కక్ష పెట్టుకుని అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. విజయనగరం అమ్మవారి సంబరాలు సందర్బంగా చోటు చేసుకున్న ఘటనలను ఆక్షేపించారు. తన పైన జరిగిన కుట్ర వెనుక ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయని బొత్సా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మాజీ మంత్రి బొత్సా సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయనగరం అమ్మవారి సంబరాలు సందర్బంగా చోటు చేసుకున్న ఘటనల పైన తీవ్రంగా స్పందించారు. తనను అంతం చేసే కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతను అవమానించాలనే ఆలోచనే ఎక్కువగా కనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Botsa Satyanaranayana alleged that there is conspiracy against him details here

అమ్మవారి ఉత్సవాలకు తాను వస్తున్నానని ముందుగా సమాచారం ఇస్తే కనీస ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను సంబరం తిలకించేందుకు కేటాయించిన వేదిక కూలటంతో.. తమ పార్టీ ఎమ్మెల్సీ సురేశ్ బాబుతోపాటు మరికొందరికి గాయాలు అయ్యాయని వివరించారు. సిరిమాను ఉత్సవంలో అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని మండిపడ్డారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాల్లో ఆర్భాటం, అహంకారమే తప్ప సంప్రదాయాలకు పెద్దగా విలువ ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు ఒక్కో ఆఫీసులో ఒక్కో హుండీ పెట్టి వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పతించారు. పండగ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపించిందని మండిపడ్డారు.

గతంలో పండగ విషయంలో నీతులు చెప్పిన గోవా గవర్నర్ ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రశ్నించారు. తనకు కేటాయించిన వేదిక కూలిపోవటం పైన పలు ప్రశ్నలు సంధించారు. తనను అవమానించాలనా, లేక అంతమొందించాలనే కుట్రతో చేసారా అంటూ వ్యాఖ్యానించారు. దీని వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అవమానంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. కాగా, బొత్సా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+