రోడ్డు పక్కన కవరులో నోట్ల కట్టలు...బాలురకు దొరికాయి:తల్లిదండ్రుల సూచనతో పోలీసులకు అప్పగింత

గుంటూరు:ముగ్గురు బాలురు...ఇంట్లో వాళ్లు ఏదో వస్తువు కొని తెమ్మంటే కొట్టు దగ్గరకు వెళుతున్నారు. ఆడుకుంటూ నవ్వుకుంటూ తుళ్లుకుంటూ వెళుతున్న వీళ్లకి దారిలో రోడ్డుపక్కన ఒక చెత్తకుప్ప దగ్గర నీట్ గా నిండుగా ఉన్న కవర్ ఒకటి కనిపించింది.

పిల్లలు కాబట్టి సహజ సిద్దమైన ఆసక్తితో ఆ కవర్ తీసుకొని తెరిచి చూడగా అందులో రూ.10, రూ.20 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. దీంతో ఆ పిల్లలు వాటిని ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. ఆ తరువాత తల్లిదండ్రుల సూచన మేరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఆ డబ్బును అప్పగించారు.ఆ చిన్నారుల నిజాయితీని పోలీసులు ప్రశంసించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

Boys found cover stuffed with cash bundles- and handed over all the money to the Police

గుంటూరు జిల్లా దాచేపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన బాలురు వేల్పుల ప్రభాస్‌ 5వ తరగతి, వేల్పుల తేజ, బండ్ల చరణ్‌ 6వ తరగతి చదువుతున్నారు. ఆదివారం వీరిముగ్గురూ ఇంటిబయట ఆడుకుంటుండగా వీరిలో ఒక బాలుడి తల్లిదండ్రులు కూల్‌ డ్రింక్స్‌ తెమ్మని పురమాయించడంతో ముగ్గురూ కలసి దుకాణానికి బయలుదేరారు.

ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తుండగా దాచేపల్లి మాజీ సర్పంచ్‌ బెల్లంకొండ భారతి భద్రి ఇంటి దగ్గర చెత్తకుప్ప ప్రక్కన ఒక కవరు కనిపించింది. తెరచి చూడగా అందులో రూ.10, రూ. 20 నోట్ల కట్టలు కనిపించాయి. వారు వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు. ఆ కవరులో మొత్తం రూ.27,840 నగదు ఉంది. అయితే ఆ తల్లిదండ్రులు నగదును పోలీసులకు అప్పగించాలని సూచించారు.

తల్లిదండ్రుల సూచన మేరకు ఆ ముగ్గురు బాలురు దాచేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని రూరల్‌ సీఐ నరసింహారావు, ఎస్‌ఐ మహ్మద్‌ రఫీలకు రూ.27,840 నగదును అందజేశారు. ముగ్గురు బాలుర నిజాయతీకి ముచ్చటపడిన పోలీసు అధికారులు వారిని ఎంతగానో ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+