తన భార్య బ్రాహ్మణిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్
తాను స్లిమ్ అవడానికి, ఫిట్ గా ఉండటానికి కారణం బ్రాహ్మణి అని, కొవిడ్ సమయంలో రెండు సంవత్సరాలు తాను ఆమెకు దొరికిపోయానని, ప్రతిరోజు పరిగెత్తించేదన్నారు.
రాష్ట్రంలోని యువత మొత్తానికి ఉద్యోగాలిచ్చి దాన్ని ముఖ్యమంత్రి జగన్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో యువతకు హామీలిచ్చిన జగన్ మాట తప్పారని, వాటిని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. మాట తప్పి, మడమ తిప్పినవారికి బుద్ధి వచ్చేలా చేస్తామన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో హలో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పారు. వాల్తేరు వీరయ్య సినిమా చూశానని, మెగాస్టార్ అభిమానినన్నారు. ఎంతైనా బాలయ్య తన ముద్దుల మామయ్య అని, ఆయన్ను అభిమానిస్తానన్నారు. ఆయన అన్ స్టాపబుల్ అని, సినిమా రిలీజ్ రోజు మొదటిషో చూసేవాడినన్నారు.
తాను స్లిమ్ అవడానికి, ఫిట్ గా ఉండటానికి కారణం బ్రాహ్మణి అని, కొవిడ్ సమయంలో రెండు సంవత్సరాలు తాను ఆమెకు దొరికిపోయానని, ప్రతిరోజు పరిగెత్తించేదన్నారు. తన డైట్ ను కంట్రోల్ చేసిందని, ప్రస్తుతం పాదయాత్రలో తాను ఇక్కడ ఏం తిన్నా తనకు తెలిసిపోతోందని, తన సీక్రెట్, తన సక్సెస్ భార్య బ్రాహ్మణి అని లోకేష్ చెప్పారు. తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా చేశారనే ఒత్తిడి కంటే బాధ్యత ఎక్కువగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. లోకేష్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చారని, బడుగు, బలహీనవర్గాలవారి గురించి అవగాహన లేదని కొందరు విమర్శిస్తున్నారని, దీనికి మీ సమాధానం ఏమిటని ఒక విద్యార్థి ప్రశ్నించారు.

తన తాత ఏపీకి ముఖ్యమంత్రి, తన తండ్రి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అని, సమాజంలో మార్పును ఏమైతే ఆశిస్తున్నామో దాన్ని ఒక యువకుడిగా ముందుకు తీసుకువెళ్లాలని సంకల్పించాను. నన్ను వైసీపీ వాళ్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, అయినా పట్టించుకోనని, తన లక్ష్యం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయడమేనన్నారు. తన కుటుంబం భోజనం చేసే సమయంలోను రాష్ట్ర సమస్యలపై చర్చిస్తామని చెపపారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం తనకు కలిగిందన్నారు. పరదాల చాటున దాక్కున్న ముఖ్యమంత్రికంటే ఎక్కువ అవగాహన తనకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications