మీ మాజీకి చెప్పండి: రేణూ దేశాయ్‌కి అంబటి రాంబాబు రిప్లై, పవన్‌కు చురక

అమరావతి: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాలోని శ్యాంబాబు పాత్రపై వివాదం కొనసాగుతూనే ఉంది. శ్యాంబాబు పాత్రతో తనను అవమానించేలా చిత్రీకరణ చేశారంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆయనపై ఓ సినిమా కూడా చేస్తానంటూ ప్రకటించారు అంబటి రాంబాబు.

ఈ నేపథ్యంలో సినీనటి, దర్శకురాలు, పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ గురువారం స్పందించారు. తన మాజీ భర్త, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ చేశారు. పవన్ డబ్బు మనిషి కాదని అన్నారు. అంతేగాక, తమ జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికారు. దీనిక కౌంటర్‌గా అంబటి రాంబాబు తాజాగా స్పందించారు.

 Bro movie issue: minister Ambati Rambabu responded on renu desai video.

'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని' అని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.
'ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు ! ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు !!
గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి !' అని అంబటి రాంబాబు ఇంతకుముందు ట్వీట్ చేశారు.

ఇక రేణూ దేశాయ్ వీడియోలో ఏమన్నారంటే.. 'ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి' అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే అంబటి తాజా ట్వీట్ చేశారు.

కాగా, సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో శ్యాంబాబు అనే పాత్రను నటుడు పృథ్వీ పోషించారు. ఈ పాత్ర తనను ఇమిటేట్ చేసేందేకే సృష్టించారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తన క్యారెక్టర్ పెట్టి పవన్ కళ్యాణ్ ఆనందపడుతున్నారన్నారు. తాము కూడా పవన్ కళ్యాణ్ మీద, ఆయన పెళ్లిళ్ల మీద సినిమా తీయగలమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+