విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కొత్త అజెండా వెనుక బ్రదర్ అనిల్ ? కేబినెట్ మార్పులకూ కారణమిదే ! బీసీ సీఎంగా కొత్త పార్టీ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో తాజాగా జరిగిన జగన్ కేబినెట్ ప్రక్షాళనపై సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ప్రభావం ఉందా ? వైసీపీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా మారిన బీసీ, ఎస్సీ, ఎస్టీల్ని లక్ష్యంగా చేసుకుని బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ప్లాన్ చేస్తుండటం వైసీపీ సర్కార్ కు ఇబ్బందిగా మారనుందా ? అందుకే జగన్ ముందుజాగ్రత్తగా ఈ మూడు వర్గాల్ని బుజ్జగించేలా కేబినెట్ లో వీరి సంఖ్యను అనూహ్యంగా పెంచేశారా ? విజయవాడలో బ్రదర్ అనిల్ అనుచరులు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 కేబినెట్ పై బ్రదర్ అనిల్ ఎఫెక్ట్ ?

కేబినెట్ పై బ్రదర్ అనిల్ ఎఫెక్ట్ ?

ఏపీలో ఒకప్పుడు వైఎస్ జగన్ కు అన్నివిధాలా అండగా నిలవడంతో పాటు తెరవెనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టిన ఆయన బావ బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు తన చర్యలతో తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణపైనా ప్రభావం చూపారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన అనుచరులు ఇవాళ విజయవాడలో పెట్టిన ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే ఇది నిజం అయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో వైసీపీకి అండగా నిలిచిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను టార్గెట్ చేస్తూ బ్రదర్ అనిల్ చేస్తున్న ప్రయత్నాలు కేబినెట్ ప్రక్షాళనపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.

 త్వరలో జగన్ అడ్డాలో అనిల్ టూర్

త్వరలో జగన్ అడ్డాలో అనిల్ టూర్

ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలోనూ పర్యటించిన బ్రదర్ అనిల్ త్వరలో జగన్ కు గట్టిపట్టున్న రాయలసీమ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఎక్కువగా ఉన్న బీసీ జనాభాతో పాటు ఎస్సీ, ఎస్టీల్ని కూడా లక్ష్యంగా చేసుకుని అనిల్ ఈ పర్యటన చేయబోతున్నారు. ముఖ్యంగా వైసీపీకి తొలిసారి మొగ్గు చూపిన బీసీల్ని జగన్ కు దూరం చేయడంతో పాటు తమ పార్టీలో చేర్చుకునేందుకు అనిల్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా పలువురు మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు, మాజీ ఐఎఎస్,ఐపీఎస్ లు బ్రదర్ అనిల్ కుమార్ తో చర్చలు జరుపుతున్నారని ఆయన అనుచరులు ఇవాళ విజయవాడలో వెల్లడించారు.

 బ్రదర్ అనిల్ కొత్త పార్టీ

బ్రదర్ అనిల్ కొత్త పార్టీ

2019 ఎన్నికల్లో బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాల్ని వైసీపీకి అనుకూలంగా మార్చడంలో బ్రదర్ అనిల్ తెరవెనుక కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అవే వర్గాలు వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. వీరిలో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన బ్రదర్ అనిల్ ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా త్వరలో కొత్త పార్టీ పెట్టేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. ఏపీలో ప్రాంతాల వారీగా పర్యటిస్తూ గతంలో తనకు అండగా నిలిచిన వారిని కలుస్తున్నారు. దీంతో ఇప్పుడు వారంతా కలిసి కొత్త పార్టీ దిశగా బ్రదర్ అనిల్ ను ప్రోత్సహిస్తున్నారు. త్వరలో ఈ కొత్త పార్టీ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 బీసీ సీఎం అజెండాతో అనిల్ కొత్త పార్టీ ?

బీసీ సీఎం అజెండాతో అనిల్ కొత్త పార్టీ ?

బ్రదర్ అనిల్ కుమార్ సహజంగా క్రైస్తవుడే అయినప్పటికీ అయనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. వారిని కలుపుకుని రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీలకు సీఎం పదవి ఆఫర్ చేస్తూ కొత్త పార్టీ పెట్టేందుకు అనిల్ పావులు కదుపుతున్నారు. తద్వారా బీసీల్ని ఇటు వైసీపీకి, అటు టీడీపీకి కూడా దూరం చేయొచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళనలో బీసీలకు జగన్ పెద్దపీట వేయడం వెనుక బ్రదర్ అనిల్ ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో కొత్త పార్టీ సీఎం అభ్యర్ధిగా బీసీని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. దీనిపై రాయలసీమ టూర్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

English summary
ys jagan's brother in law anil kumar's new political party will be established soon, according to his close aide sonti nagaraju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X