బుడమేరుకు మళ్లీ వరదంటూ ప్రచారం: జనం పరుగులు, అంతా ఫేకే

విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లోకి శనివారం రాత్రి మళ్లీ వరద వస్తుందంటూ ప్రచారం జరగడంతో అక్కడి ప్రజలంతా ఉరుకులు పరుగులు పెట్టారు. బుడమేరుకు వరద ముంపు వచ్చిందని కొద్దిసేపట్లో మళ్లీ ఇళ్లల్లోకి వరదనీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిగా ప్రాంతాలవారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనతో పరుగులు తీశారు.

అయితే, ఇదంతా ఫేక్ ప్రచారమని కలెక్టర్ తోపాటు అధికారులు తేల్చారు. బుడమేరుకు ఎలాంటి వరదలేదని.. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. మరోవైపు మంత్రి నారాయణ కూడా ఈ ఫేక్ ప్రచారం స్పందించారు. విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం వదంతులు మాత్రమేనని మంత్రి నారాయణ స్పష్టంచేశారు.

Budameru flood again campaign Minister Narayana says everything is fake

కొత్త రాజరాజేశ్వరీ పేట, జక్కంపూడి కాలనీలతో పాటు వివిధ ప్రాంతాల్లో వరద వస్తోందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరం పూర్తి భద్రంగా ఉందని స్పష్టంచేశారు.

బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రకటించారు. బుడమేరుకు ఎలాంటి వరదనీరు రావటం లేదని స్పష్టం చేశారు. కొందరు ఆకతాయిలు ఈ తరహా వదంతుల్ని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా, ఇటీవల భారీ వర్షాలతో బుడమేరు విజయవాడలోని చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పలువురు మరణించడంతోపాటు భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది. వరదలతో సుమారు వారం రోజులపాటు ఇబ్బందులు పడిన జనం.. ఇప్పుడిప్పుడే దాన్నుంచి తేరుకుంటున్నారు. మళ్లీ వరదలు వస్తున్నాయంటూ ప్రచారం జరగడంతో ఆందోళనకు గురయ్యారు. అదంతా ఫేక్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+