100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం - చంద్రబాబుపై వాగితే : బుద్దా వెంకన్న సంచలనం..!!

టీడీపీ నేత..మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు జన్మదినం కావటంతో పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని వైసీపీ నేతలు కలలు కంటున్నారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగే బ్యాచ్‌కి హెచ్చరికలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉంది

సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉంది

చంద్రబాబు కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందన్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్దమంటూ వ్యాఖ్యానించారు. సీనియర్లను కాదని జోగి రమేష్‌కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే అని వాళ్ల పార్టీ నేతలే చెప్పారన్నారు. వచ్చే రెండేళ్ల పాటు చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా 500 మందికి చీరలు పంపిణీ చేశామన్నారు.

చంద్రబాబు జన్మదిన వేడుకలు

చంద్రబాబు జన్మదిన వేడుకలు


ప్రతి మనిషిలో కృతజ్ఞత అనేది ఉండాలని.. పార్టీలో తనకు, నాగుల్ మీరాకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని బుద్ధా వెంకన్న తెలిపారు. చంద్రబాబు కటౌట్‌కు పంచామృతాలతో పాలాభిషేకం చేసినట్లు వివరించారు. అటు ప్రతి మనిషిలో కృతజ్ఞత అనేది ఉండాలని.. పార్టీలో తనకు, నాగుల్ మీరాకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని బుద్ధా వెంకన్న తెలిపారు. చంద్రబాబు కటౌట్‌కు పంచామృతాలతో పాలాభిషేకం చేసినట్లు వివరించారు. చంద్రబాబు ముందు చూపు వల్లే ఉమ్మడి ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు.

జగన్ ప్రజలను నట్టేట ముంచారంటూ

జగన్ ప్రజలను నట్టేట ముంచారంటూ

ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. నమ్మి ఓట్లేస్తే జగన్ ప్రజలను నట్టేట ముంచాడని మండిపడ్డారు. జగన్ వైఫల్యాలపై ప్రజలు విసిగి పోయారని.. చంద్రబాబు పాలన మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలోనూ ఇదే విధమైన వ్యాఖ్యలతో మాజీ మంత్రి కొడాలి నాని ...బుద్దా వెంకన్న మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఇక, ఇప్పుడు మరోసారి బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. బుద్దా వెంకన్న కామెంట్స్ మాత్రం పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+