'వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరింది వాస్తవం కాదా': బయటపెట్టిన వైసిపి

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరింది వాస్తవం కాదా అని వైసిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం నాడు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో సాంకేతిక లోపాలున్నాయని చెప్పి స్పీకర్ కోడెల శివప్రసాద రావు తిరస్కరించడం సరికాదన్నారు.

అన్ని సరిగ్గా ఉన్న పిటిషన్లను అప్పుడే సభాపతికి అందించామని చెప్పారు. ఫిరాయింపుల అనర్హత పిటిషన్లను ఇప్పటి దాకా ఎందుకు పెండింగులో పెట్టారో చెప్పాలన్నారు. తాము ఏప్రిల్లోనే సరైన పిటిషన్లు ఇస్తే, ఇప్పటి దాకా పెండింగులో పెట్టారన్నారు.

Buggana reveals why Speaker Kodela dismissed petitions

పార్టీ మారిన ఎమ్మెల్యేలు విషయంలో చట్టం ఏం చెప్తుందో తెలియదా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు. అందుకే తాము పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు. ఈ నెల 8న సుప్రీంలో దీనిపై విచారణ జరగనుందని చెప్పారు.

అసలు కారణం వేరే..! అందుకే అనర్హత పిటిషన్ల తిరస్కరణ : బుగ్గన
ఈ లోగా సుప్రీంకు ఏదో ఒక కారణం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే పిటిషన్లను తిరస్కరించారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం ఎన్నో చారిత్రక తీర్పులు ఇచ్చిందని, అవసరమైతే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఉందని చెప్పినట్లు బుగ్గన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Buggana Rajendranath Reddy reveals why Speaker Kodela Sivaprasad Rao dismissed petitions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X