వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గు కుంభకోణం: దాసరిపై మచ్చ, కాగ్ నివేదికతో వెలుగులోకి, సిబిఐ కేసు

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో భారీ బొగ్గు కుంభకోణం చోటుచేసుకొంది. 2012 లో కాగ్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది.2 జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని మించిన దోపిడి జరిగిందని ఈ నివేదికను పార్లమెం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో భారీ బొగ్గు కుంభకోణం చోటుచేసుకొంది. 2012 లో కాగ్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది.2 జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని మించిన దోపిడి జరిగిందని ఈ నివేదికను పార్లమెంట్ ముందుకు నివేదికను తెచ్చింది.ఈ కుంభకోణం జరిగిన సమయంలో దాసరి నారాయణరావు బొగ్గుశాఖ సహయమంత్రిగా ఉన్నారు.

యూపీఏ ప్రభుత్వహయంలో బొగ్గుక్షేత్రాల అక్రమ కేటాయింపు తెలుగు సినీ రంగానికి చెందిన దర్శకరత్న దాసరినారాయణరావు చుట్టుకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయంలో బొగ్గు శాఖకు సహయమంత్రిగా ఉన్న దాసరికి ఇది చుట్టుకొంది.

దాసరినారాయణరావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ కు కూడ ఈ కేసులో భాగస్వామ్యం ఉందని సిబిఐ ఎప్ ఐ ఆర్ లో పేర్కొంది.బొగ్గు గనులకేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది.ఈ విషయమై ఇటీవల కాలంలో కూడ సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

2006-09 మధ్య కాలంలో బొగ్గు గనుల శాఖ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వద్దే ఉండేది. బొగ్గు నిల్వల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దాదాపు వంద ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ , స్టీల్ సిమెంట్ పరిశ్రమలకు చెందిన కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు బొగ్గునిల్వలను కారుచౌకగా కొట్టేశాయని కాగ్ నివేదిక బయటపెట్టింది.

బొగ్గు క్షేత్రాల వేలం వేయలేదు

బొగ్గు క్షేత్రాల వేలం వేయలేదు

బొగ్గు క్షేత్రాల వేలం విధానానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుమాుఖంగా ఉన్నారు. అయితే అది ఆచరణరూపం దాల్చలేదు. సరళీకృత ఆర్ధికవిధానాల కారణంగా 1990 దశకంలో ప్రైవేట్ సంస్థలు, బొగ్గువెలికితీత రంగంలోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిక్షేపాలున్నా, అందుకు తగ్గ డిమాండ్ లేకపోవడంతో అప్పట్లో బొగ్గు తవ్వకాలకు ఎవరూ కూడ ఆసక్తిచూపలేదు.అయితే 2003 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యుత్ , సిమెంట్ ఉత్పాదక రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశించడంతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్ కు తగ్గట్టుగా బొగ్గు గనుల్ని కేటాయించే విధానాలు లేకపోవడం పాత పద్దతులే కొనసాగుతుండడంతో అక్రమాలకు తెరలేచింది.

రాష్ట్రాల సిఫారసుల ఆధారంగా అనుమతులు

రాష్ట్రాల సిఫారసుల ఆధారంగా అనుమతులు

2004 లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గుగనుల్లో తవ్వకాలకు రాష్ట్రాల సిఫారసు ఆధారంగానే కేంద్రం ప్రైవేట్ సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. బొగ్గు గనుల్ని ప్రైవేట్ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టకుండా వేలం పద్దతిని ఎందుకు అనుసరించలేదనే ప్రశ్న తలెత్తింది. ఈ అంశంపై క్యాబినెట్ లో చర్చకు పెట్టలేదు. బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఏకపక్షంగా ప్రైవేట్ సంస్థలకు పాతపద్దతుల్లోనే గనులను కేటాయించింది.

బిజెపి పిర్యాదుతో ఇలా

బిజెపి పిర్యాదుతో ఇలా


బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బిజెపి అధికారప్రతినిధఇ ప్రకాష్ జవదేకర్ చీప్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదుచేశారు. అదే సమయంలో కాగ్ కూడ ఈ వ్యవహరంపై దృష్టి కేంద్రీకరించింది. కాగ్ అభ్యంతరాలను అప్పటి బొగ్గు గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి పిసి ఫరేఖ్ కూడ మద్దతు పలకడంతో కేంద్రం ఇరుకునపడింది.

పిపి ఫరేఖ్ నివేదిక

పిపి ఫరేఖ్ నివేదిక

అప్పటిదాకా అమల్లోఉన్న క్యాప్టివ్ విదానానికి బదులు గనుల్ని వేలం వేయడం ద్వారా ఆదాయం ఎలా సమకూరుతోందో వివరిస్తూ అప్పటి బొగ్గు గనుల శాఖ కార్యదర్శి పిసీ పరేఖ్ ఓ నివేదికను 2004 జూలై 16న, దాసరినారాయణరావుకు సమర్పించారు. ఈ నివేదికపై ఇతర ప్రభుత్వ శాఖల అభిప్రాయాలను తెలుసుకోవాలని దాసరి సూచించారు. జూలై 30న, దాసరి కోరిన వివరణలను బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి పరేఖ్ అందజేశారు. ప్రభుత్వం కేటాయించే విధానంలో కొన్ని సంస్థలకే బొగ్గు క్షేత్రాలను కేటాయించే వీలుందన్నారు.

English summary
CAG revealed coal scam in India.former minister Dasari Narayanarao , congress Mp Naveen jindal and others was involved in this case allege CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X